కోలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం 'సర్కార్'. విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. టీజర్ విడుదలైన పది నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ దాటేసి ఆశ్చర్యపరిచింది. ఒక్క గంటలోనే ఈ టీజర్ 4 మిలియన్ వ్యూస్ దాటేసింది.

ఇప్పటివరకు ఈ సినిమాకి 13 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇంతవేగంగా రికార్డులు సృష్టించిన ఘనత 'సర్కార్' టీజర్ కే సొంతం. ఇక ఈ సినిమా విషయానికొస్తే..  సంపన్నుడైన హీరో తన ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం ఇండియాకి వస్తాడు.

ఈ క్రమంలో జరిగే పరిణామాల నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది. విజయ్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ కనిపించనుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమా తెరక్కుతోంది. 

ఇవి కూడా చదవండి.. 

విజయ్ 'సర్కార్' టీజర్!

దసరా రోజు విజయ్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్!