తమిళనాడు స్టార్ హీరో విజయ్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగులో విజయ్ కి ఉన్న ఇమేజ్ తో పోలిస్తే కేరళలో ఆయనకి మంచి 
ఫాలోయింగ్ ఉంది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా రిలీజ్ సందర్భంగా కేరళలోని ఒక థియేటర్ లో నాన్ స్టాప్ గా 24 గంటల పాటు ఆ సినిమాను ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. ఒక షో తరువాత మరొకటి చొప్పున రోజు మొత్తంగా సినిమాను నడిపించనున్నారు. త్రిసూర్ లోని కార్తిక థియేటర్లో ఈ విధంగా ప్రదర్శించనున్నారు.

కేరళలో చేస్తోన్న హడావిడి చూసి చెన్నైలో కూడా మొదలుపెట్టారు. రోహిణి థియేటర్ యాజమాన్యం 'సర్కార్' సినిమాను 48 గంటల పాటు నాన్ స్టాప్ గా షోలు వేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే దీనికి ఇంకా అనుమతులు రానప్పటికీ షోలు మాత్రం వేసి తీరతామని థియేటర్ యాజమాన్యం చెబుతోంది.

విడుదలకు ముందు ప్రీరిలీజ్ బిజినెస్ తో రికార్డులు సృష్టించిన ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ కనిపించనుంది.  

ఇవి కూడా చదవండి.. 

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!