ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతోమంచి గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ మరణ వార్తతో ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. తన మేనరిజమ్స్ తో మనల్ని ఎంతో నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరనే విషయాన్ని సినీ జనాలు భరించలేకపొతున్నారు.

గతంలో ఆయన పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలలో చిరు, బాలయ్యలపై తన ప్రేమను  చాటుకున్నారు. చిరూ సినిమా కోసం తాను గుండు కొట్టించుకున్నానని,బాలకృష్ణ 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం కూమా తిరుపతిలో గుండు కొట్టించుకున్నాననీ చెప్పాడు.

వాళ్లిద్దరూ అంటే తనకు చాలా ఇష్టమని.. ఇద్దరితోనూ మంచి అనుబంధం ఉందని అన్నారు. ఒక సినిమాకి వినాయక్ దర్శకుడైతే .. మరో సినిమాకి దర్శకుడు క్రిష్. వాళ్లిద్దరూ తనకు మంచి మిత్రులేనని.. నటుడిగా తన రేంజ్ పెరిగేలా చేసింది వినాయక్ అని.. క్రిష్ తోను ఎంతో సాన్నిహిత్యం వుందని చెప్పారు.

ఆ కారణంగా సినిమాలు హిట్ కావాలని అలా చేశానే తప్ప .. వాళ్లను కాకా పట్టడం కోసం కాదని చెప్పారు. ఇప్పుడు వేణుమాధవ్ మృతదేహాన్ని కాప్రా హెచ్ బీ కాలనీ మంగాపురంలోకి తీసుకురానున్నారు. 

 

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..