పోర్న్‌స్టార్, ఐటమ్ బాంబ్ సన్నీలియోన్ వీరనారిగా కత్తి తిప్పేందుకు ‘వీరమహాదేవి’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను చెన్నైలో కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసింది సన్నీ.. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. కత్తి, విల్లు పట్టుకుని ఉన్న ఈ పోస్టర్‌లో సన్నీలియోన్.. ‘రుద్రమదేవి’ సినిమాలో అనుష్కను జిరాక్స్ కాపీ దింపేసింది. కత్తి పట్టి వీరత్వం, రౌద్రం, పౌరుషం ఎంత పలికించాలని ట్రై చేసినా వీరనారిగా మాత్రం సన్నీ పెద్దగా సెట్ కాలేదనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది.