డ్యాన్స్ ప్రోగ్రామ్ ఢీ10లో టీమ్ లీడర్లలో ఒకరు వర్షిణి సౌందర్ రాజన్. రేష్మీ - సుధీర్ - హేమంత్ లతో పాటూ ఆమె ఒక టీమ్ లీడర్. వారితో కలిసి బాగానే నవ్వులు పువ్వులు పూయిస్తోంది. వర్షిణి తనలోని గ్లామర్ యాంగిల్ ను చూపించేందుకు సిద్ధమైంది. మొదటిసారి బికినీలోని ఫోటోలను తన సోషల్ ఖాతాలో పోస్టు చేసింది. ఇంకేముంది ఆ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. 


వర్షిణి అసలు పేరు షామిలి సౌందర్ రాజన్. చందమామ కథలు - లవర్స్ వంటి సినిమాలలో నటించింది. అంతేకాదు డైరెక్టర్ అరుణ్ పవర్ ప్రేమ - నిశ్చితార్ధం వరకు వచ్చింది కథ. ఏమైందో ఏమో పెళ్లి మాత్రం జరగలేదు. ఆమె కూడా తాను సింగిల్ అనే చెప్పుకుంటోంది. ఇప్పుడిప్పుడు బుల్లితెరపై కనిపించడం ప్రారంభించడంతో... ఆ పాపులారిటీని రష్మి - అనసూయ లాగానే వాడుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. వారిలాగే గ్లామరస్ ఫోటోలు - చిట్టి పొట్టి బట్టలతో కనిపిస్తోంది. ఈ మధ్యనే అమ్మడు స్నేహితులతో కలిసి మలేషియా వెళ్లిందట. అక్కడ దుమ్ము రేపేసింది పిల్లా. 


మలేషియా సముద్రాలలో బికినీతో ఫోటోలు తీయించుకుంది. తాను కూడా ఏమాత్రం తక్కువ కానని గ్లామర్ పాత్రలైనా ఎక్స్ పోజింగ్కు సిద్ధమేనని చెప్పకనే చెబుతోంది ఫోటోలో. చూడాలి ఈ ఫోటోలు చూశాక ఆమె ఆశించినట్టుగా సినిమా అవకాశాలు వచ్చి పడతాయో లేవో. అన్నట్టు ఇప్పుడు సుధీర్ బాబు సినిమాలో ఆయన మరదలిగా నటిస్తోందంట వర్షిణి.