Asianet News TeluguAsianet News Telugu

రాజశేఖర్ గరుడవేగ హిట్ మూవీ కాదా.. ఈ లెక్కలేంటి?

  • రిలీజ్ అయినప్పటి నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న గరుడవేగ
  • రాజశేఖర్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు
  • ఈ మూవీ కలెక్షన్స్ సూపర్ అని ప్రకటించిన నిర్మాతలు
  • తాజాగా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం గరుడవేగ సేఫ్ మాత్రమే, హిట్ ఎలాననే టాక్
trade analysts report on garuda vega

రాజశేఖర్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వచ్చిన గరుడవేగ చిత్రం ఫస్ట్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రాజశేఖర్ కు కమ్ బ్యాక్ మూవీలా నిలిచిందనేది పబ్లిక్ టాక్. జీవితా రాజశేఖర్ కుటుంబం కూడా... చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కూడా దూసుకెళ్లిందని ప్రకటించారు. ఓవర్సీస్ కలెక్షన్స్ తోపాటు మొత్తం అంతా కలిపి బాగానే వసూళ్లు సాధించిందని.. దాదాపు ఇరవై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని నిర్మాతలు పేర్కొన్నారు.  తొలి ఇరవై రోజుల్లోనే ఈ సినిమా ఆ వసూళ్లను సాధించేసిందని ప్రకటించారు.
 

అయితే తాజాగా పీఎస్‌వీ గరుడవేగ థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిన నేపథ్యంలో... ఈ సినిమా వసూళ్ల గురించి ట్రేడ్ ఎనలిస్టుల రిపోర్ట్ ప్రకారం.... మొత్తం ఏడున్నర కోట్ల రూపాయలు షేర్ సాధించిందంటున్నారు. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ నేపథ్యంలో ఈ వసూళ్లు దక్కాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ పదిహేను కోట్ల రూపాయల పైనే స్థాయి బడ్జెట్ తోనే ఈ సినిమా రూపొందింది.

 

హిట్ సినిమా అంటే పదిహేను కోట్లు వసూళ్లు సాధించాలి. కానీ థియేట్రికల్ కలెక్షన్స్ ఆ స్థాయిలో రాలేదని ట్రేడ్ ఎనలిస్టులు చెప్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు శాటిలైట్, డిజిటిల్ రైట్స్ ప్రధాన ఆదాయ వనరులుగా అగుపిస్తున్నాయి. సినిమా హిట్ అనిపించుకున్న నేపథ్యంలో శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ మొత్తమే దక్కిందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో సన్నీలియోన్ ఉండటం, యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో దీన్ని.. ఇతర భాషల్లోకి అనువదించేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

 

ఇలాంటి ఆదాయ మార్గాలతో పీఎస్‌వీ గరుడ వేగ నిర్మాతలు బయటపడే స్థితి ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నా... హిట్ అని టాక్ వచ్చిన సినిమా గురించి బైటపడుతుంది అని చెప్పుకోవాల్సి రావటంపైనే అసలు చర్చ జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios