కొద్దీ సేపటి క్రితమే వేణు మాధవ్ అంతిమ యాత్ర మొదలైంది. మౌలాలి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. అక్కడ రెండు గంటలపాటు అభిమానుల సందర్శనార్ధం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. తెలుగు సినీ నటులతో పాటు అభిమానులు కడసారి నవ్వుల వేణును చూసేందుకు తరలివస్తున్నారు.

కొద్దీ సేపటి తరువాత వేణు భౌతికాయాన్ని మౌలాలికి తరలించనున్నారు.  స్థానికంగా ఉండే లక్ష్మి నగర్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో బుధవారం ఆయన తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారని ఆయన బ్రతికే అవకాశం ఉందని ఎంతగానో ఎదురుచూసిన కుటుంబ సబ్యులకు అభిమానులకు చేదు వార్త ఎదురైంది.  

వేణుమాధవ్ మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని సినిమాల ద్వారా ఆయన అభిమానుల గుండెల్లో బ్రతికే ఉంటారని సినిమా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - నాని వంటి స్టార్స్ తో పాటు అనుష్కా కూడా వేణుమాధవ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. 600కి పైగా సినిమాల్లో నటించిన వేణుమాధవ్ లక్ష్మి సినిమాకు గాను బెస్ట్ కమెడియన్ గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..