- Home
- Entertainment
- Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. సోషల్ మీడియా సెలెబ్రిటీల పాలిట శాపంగా మారుతున్న సంగతి తెలిసిందే. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకోండి.

పాన్ ఇండియా చిత్రాలతో ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ దేవర, వార్ 2 చిత్రాల్లో నటించారు. దేవర విజయం సాధించగా, వార్ 2 డిజాస్టర్ అయింది. ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
సెలెబ్రెటీలకు శాపంగా మారిన సోషల్ మీడియా
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలెబ్రిటీల పేర్లు మిస్ యూజ్ అవుతున్నాయి. కొందరు సెలెబ్రిటీల పేర్లు, ఫోటోలు, వీడియోలని వారి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని పోస్టుల వల్ల అగ్ర హీరోలు, హీరోయిన్ల ప్రతిష్ఠ దెబ్బ తింటోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. దీనితో చిరంజీవి వెంటనే కోర్టుని ఆశ్రయించి తన వ్యక్తిగత హక్కులని కాపాడేలా పిటిషన్ వేశారు.
చిరంజీవి తర్వాత ఎన్టీఆర్
దీనితో కోర్టు చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వీడియోలు వాణిజ్య ప్రయోజనాల కోసం, ఆయన ప్రతిష్ఠ దిగజార్చేలా వాడకూడదు అని ఆదేశాలు ఇచ్చింది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి తరహాలోనే తన పేరు, ఫోటోలని కూడా కొందరు దుర్వినియోగం చేస్తున్నారు అని తారక్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు.
తారక్ కి అనుకూలంగా ఆదేశాలు
తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రవర్తిస్తున్నారు అని, ఈ- కామర్స్ సైట్స్ కూడా తన ఫోటోలని వాడుతున్నాయి అని తారక్ పిటిషన్ వేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా నేతృత్వంలోని ఢిల్లీ హై కోర్టు తారక్ పిటిషన్ పై విచారణ జరిపింది. తారక్ వ్యక్తిగత హక్కులని కాపాడేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
కోర్టులని ఆశ్రయిస్తున్న తారలు
ఈ కేసుని ధర్మాసనం డిసెంబర్ 22కి వాయిదా వేశారు. మొత్తంగా సెలెబ్రిటీలు తమ హక్కులని కాపాడుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కక తప్పడం లేదు. చిరంజీవి, ఎన్టీఆర్ తో పాటు గతంలో నాగార్జున, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లాంటి సెలెబ్రిటీలు కూడా తమ హక్కుల కోసం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

