- Home
- Entertainment
- 8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
ఓ హీరోయిన్ తెలుగులో 8 సినిమాల్లో నటించగా 6 ఫ్లాప్ అయ్యాయి. బిగినింగ్ లో ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. తనని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం పట్ల ఆ నటి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ఉప్పెన చిత్రంతో కృతి శెట్టి ఎంట్రీ
తొలి చిత్రంతోనే ఆమె ఒక సంచలనంగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సాధించిన బాక్సాఫీస్ సక్సెస్ తో ఆమె టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అన్నీ కరెక్ట్ గా వర్కౌట్ అయి ఉంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందాల్సిన నటి ఆమె. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఉప్పెన చిత్రంతో అభిమానులని సొంతం చేసుకున్న కృతి శెట్టి. ఈ యంగ్ బ్యూటీ ఉప్పెన మూవీలో క్యూట్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది.
కృతి శెట్టి సినిమాలు
ఉప్పెన 2021 బిగ్గెస్ట్ హిట్ తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత కృతి శెట్టికి అవకాశాల ఉప్పెన మొదలైంది. వరుసగా క్రేజీ సినిమాల్లో ఆమెకి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఉప్పెన తర్వాత ఆ రేంజ్ హిట్ కృతి శెట్టికి మళ్ళీ పడలేదు. నాగ చైతన్యకి జోడీగా నటించిన బంగార్రాజు చిత్రం యావరేజ్ గా నిలిచింది. మిగిలిన చిత్రాలన్నీ డిజాస్టర్ అయ్యాయి.
కృతి శెట్టి ఫ్లాపులు
శ్యామ్ సింగ రాయ్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే చిత్రాలు కృతి శెట్టికి డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చాయి. కృతి శెట్టి నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. కృతి శెట్టి నటించిన లేటెస్ట్ తమిళ మూవీ అన్నగారు వస్తారు డిసెంబర్ 12న రిలీజ్ అవుతోంది. హీరో కార్తీకి జోడిగా కృతి శెట్టి నటించింది. ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది.
సినిమాలు ఫ్లాప్ కావడంతో నిందలు
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కృతి శెట్టి భావోద్వేగానికి గురైంది. దానికి కారణం తనపై వస్తున్న నిందలే. తాను నటించిన సినిమాలు ఫెయిల్ అవుతుండడంతో అంతా నన్నే నిందిస్తున్నారు అంటూ కృతి శెట్టి ఎమోషనల్ అయింది. సోషల్ మీడియాలో కొందరు తనని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా ద్వేషాన్ని పొందాల్సి రావడం భరించలేని విషయం అని కృతి శెట్టి పేర్కొంది.
ఎంతో ఒత్తిడికి గురయ్యా
కృతి శెట్టి మాట్లాడుతూ.. నటన కెరీర్ గా ఎంచుకున్న బిగినింగ్ లో చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇండస్ట్రీ గురించి నాకు.. మా అమ్మ నాన్నలకు ఎలాంటి అవగాహన లేదు. కష్టంగా ఉంటే సినిమాలు మానేయమని నాన్న చెప్పారు. నేను కూడా ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టా. ఆ సమయంలో ఉప్పెన చిత్రం ఇచ్చిన విజయం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అని కృతి శెట్టి పేర్కొంది. ఇండస్ట్రీలో ఒత్తిడి వల్ల కెరీర్ బిగినింగ్ లో జుట్టు రాలిపోవడం, చర్మ సమస్యలు లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది.

