విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'టాక్సీవాలా' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తొలి ఆటతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ని మధ్యలోనే ఆపేయాలని నిర్ణయించుకున్నారట చిత్రయూనిట్.

ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ స్వయంగా వెల్లడించారు. దానికి కారణం హీరోయిన్ నయనతార అని చెబుతున్నాడు. టాక్సీవాలా రిలీజ్ కి ముందు ఈ సినిమా నయనతార నటించిన 'డోరా' సినిమాకు దగ్గర ఉంటుందనే అనుమానాలను వ్యక్తం చేశారు. దర్శకుడు రాహుల్ కి కూడా షూటింగ్ సమయంలో అదే సందేహం కలిగిందట. 

అందుకే 'డోరా' సినిమా రిలీజ్ అయ్యే వరకు తమ షూటింగ్ ని మధ్యలోనే నిలిపివేశారట. ''టాక్సీవాలా సినిమా షూటింగ్ మొదలుపెట్టి దాదాపు సగం షూటింగ్ పూర్తయిన తరువాత 'కారులో ఆత్మ' అనే కాన్సెప్ట్ తో నయనతార 'డోరా' సినిమా రానున్నట్లు తెలిసింది. ఆ సినిమా పోస్టర్ చూసి నేను చాలా భయపదిపోయాను.

నా సినిమా కాన్సెప్ట్ ఆ సినిమాకు దగ్గరగా ఉందనిపించింది. దీంతో షూటింగ్ కొద్దిరోజులు పాటు వాయిదా వేసేశాం. డోరా సినిమా రిలీజ్ అయిన వెంటనే తొలి షోకి వెళ్లి సినిమా చూశాను. మొదట నా సినిమాకు కాస్త దగ్గరగా ఉందనిపించినా.. ఇంటర్వెల్ తరువాత అసలు సంబంధం లేదని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను'' అంటూ దర్శకుడు రాహుల్ చెప్పుకొచ్చాడు. 

ఇవి కూడా చదవండి.. 

'టాక్సీవాలా' రెండు రోజుల కలెక్షన్స్!

'టాక్సీవాలా'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

టాక్సీ వాలా కలెక్షన్స్: మరోసారి అదరగొట్టిన విజయ్!

‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ..

'గీత గోవిందం' తరువాత సినిమాలు మానేయాలనుకున్నాడట!

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా