టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కి తెర పడింది. నవంబర్ 16న సినిమాని విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

నిజానికి దీపావళి సందర్భంగా సినిమాను విడుదల చేయాలనుకున్నారు కానీ ఆరోజు బుధవారం కావడం పైగా అమావాస్య సెంటిమెంట్ అడ్డు పడడంతో సినిమాను నవంబర్ 16 రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇటీవలే ఈ సినిమా లీకేజీ సమస్యలతో ఇబ్బంది పడింది. ఇప్పుడు ఆ గాయాలు ఓ తగ్గడం, సినిమాలో సీజీ వర్క్ కూడా పూర్తి కావడంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఇప్పుడు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ నుండి వచ్చి 'టాక్సీవాలా' ప్రమోషన్స్ లో పాల్గొనున్నాడు. విజయ్ నటించిన 'నోటా' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ దాని ప్రభావం ఈ సినిమాపై పెద్దగా పడ్డట్లు కనిపించడం లేదు. బయ్యర్లు కూడా సినిమాను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!

ఇది కూడా చదవండి.. 

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!