టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ సినిమాతో రాహుల్ సాంకృత్యాన్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కానున్నాడు.

అయితే మొదట ఈ సినిమా కథ విని పారిపోబోయాడట విజయ్ దేవరకొండ. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. ''సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో సాగే కథ ఇది. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం సిటీకి వెళ్లే ఓ అబ్బాయి జాబ్ దొరకకపోవడంతో క్యాబ్ డ్రైవర్ గా మారతాడు. ఓ పాతకాలం నాటి కారుని వెతుక్కొని దాన్ని నడుపుతూ డబ్బు సంపాదిస్తుంటాడు.

అలా సాఫీగా సాగిపోతున్న అతడు ఎలాంటి అనుభావాలు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ. నాకు మొదటి నుండి హారర్ సినిమాలంటే చాలా భయం. ఓ రోజు కథ వినాలంటూ యూవీ క్రియేషన్స్ నుండి ఫోన్ వచ్చింది. నేను అక్కడకి వెళ్లిన తరువాత రాహుల్ ని కథ చెప్పమన్నారు.

వెంటనే ఆయన ఇది హారర్ జోనర్ లో సాగే కథ అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వినగానే నేను లేచి పారిపోబోయా.. కానీ రాహుల్ నన్ను ఆపి మరీ కథ మొత్తం చెప్పాడు. కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాను'' అంటూ చెప్పుకొచ్చాడు. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మాళవిక నాయర్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. 

ఇవి కూడా చదవండి.. 

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

విజయ్ దేవరకొండ వదిలేటట్లులేడు, తలపట్టుకున్న రవితేజ!