సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకి కొదవ ఉండదు. కాంబినేషన్స్, గెస్ట్ రోల్స్ ఇలా చాలా విషయాల్లో సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు  అలాంటి సెంటిమెంట్ విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' సినిమాకి కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

నటి మాళవిక నాయర్ 'టాక్సీవాలా' సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. కథ మొత్తం కూడా ఆమె చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఇప్పటివరకు మాళవిక నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. ఇప్పుడు ఆమె గోల్డెన్ లెగ్ ఈ సినిమాకి కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకండా సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా కనిపిస్తుండగా.. ముఖ్య పాత్రలో మాళవిక కనిపించనుంది. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నటించింది మాళవిక. ఆ సినిమాలో ఇద్దరు స్నేహితులుగా కనిపిస్తారు. 

ఈ సినిమాలో కూడా ఆమెది హీరో సరసన కనిపించే టిపికల్ హీరోయిన్ రోల్ కాదని తెలుస్తోంది. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. గీతా2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాతో రాహుల్ సాంక్రిత్యన్ అనే దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. 

ఇది కూడా చదవండి.. 

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

విజయ్ దేవరకొండ వదిలేటట్లులేడు, తలపట్టుకున్న రవితేజ!