ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. అతి తక్కువ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరో సినిమాలు మానేయాలని అనుకున్నాడట.

ఇది ఎప్పటి విషయమో కాదండీ.. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలు హిట్ అయిన తరువాతే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించాడు. ''ఓరోజు మా అమ్మకి ఒంట్లో బాగోలేకపోవడంతో ఆమెను నా కార్లో హాస్పిటల్ కి తీసుకెళ్తున్నా.. ఆ సమయంలో అమ్మ పరిస్థితి చూసి భయమేసింది. సినిమాలు అన్నీ వదిలేయాలనిపించింది. 

నిర్మాతలకు ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాలనుకున్నాను. అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేయాలని అనుకున్నాను. కానీ ఆ మూమెంట్ నుండి తొందరగానే బయటపడ్డాను'' అంటూ చెప్పుకొచ్చాడు. వరుస సినిమాలతో బిజీగా ఉండడమే దానికి కారణమని తెలుస్తోంది.

అయితే ఇకపై ఇలా వరుస సినిమాలు కాకుండా ఒక సినిమా తరువాత మరొకటి అనే పద్దతిలో సినిమాలు చేస్తే తన కోసం కొంత సమయాన్ని కేటాయించుకునే అవకాశం దక్కుతుందని అన్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇవి కూడా చదవండి.. 

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

విజయ్ దేవరకొండ వదిలేటట్లులేడు, తలపట్టుకున్న రవితేజ!