టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత విజయ్ నటించిన 'గీతా గోవిందం' విడుదలవుతుందని తెలిసినప్పుడు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్లే సినిమా భారీ వసూళ్లను సాధించింది. 'నోటా' రిలీజ్ కి ముందు కూడా సినిమాపై హైప్ పెరిగింది.

కానీ 'టాక్సీవాలా' విషయంలో మాత్రం విజయ్ మ్యాజిక్ పని చేయడం లేదు. పైగా ఈ సినిమా ట్రైలర్ కూడా నయనతార నటించిన 'డోర'ని తలపించడంతో ప్రేక్షకులకి ఆసక్తి సన్నగిల్లింది. విజయ్ కి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా ఆడేస్తుందని మేకర్స్ భావిస్తున్నప్పటికీ జనాల్లో మాత్రం ఆ స్థాయి క్రేజ్ ఏర్పడలేదనే చెప్పాలి.

'గీత గోవిందం' సినిమాకి వచ్చిన కలెక్షన్స్ లో నాలుగో వంతు కలెక్షన్లు 'టాక్సీవాలా'కి వచ్చినా సినిమా హిట్టు కిందే లెక్క. నెగెటివ్ టాక్ వస్తే మాత్రం విజయ్ దేవరకొండ రేసులో వెనకబడే ఛాన్స్ ఉంది.  

ఇవి కూడా చదవండి.. 

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

విజయ్ దేవరకొండ వదిలేటట్లులేడు, తలపట్టుకున్న రవితేజ!