MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు

Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు

 Gunde Ninda Gudi Gantalu: రోహిణీ వీడియో కోసం బాలు ఫోన్ కొట్టేస్తుంది. అందులో వీడియో తీసుకొని గుణకి పంపిస్తుందా? నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. 

3 Min read
Author : ramya Sridhar
Published : Feb 27 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Gunde Ninda Gudi Gantalu
Image Credit : Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu

బాలు తన ఫోన్ కనిపించడం లేదు అంటూ..వెతుకుతూ ఉంటాడు. ఇదే విషయాన్ని వచ్చి మీనాకు చెబుతాడు. మీనా తన ఫోన్ నుంచి బాలు ఫోన్ కి కాల్ చేస్తుంది. అది చూసి వెంటనే రోహిణీ.. ఫోన్ కట్ చేస్తుంది. ‘ ఫోన్ రింగ్ అవుతుంది కానీ.. ఎవరో కట్ చేస్తున్నారండీ’ అని మీనా చెబుతుంది. వీళ్లు ఫోన్ వెతుకుదాం అనుకునేలోగా.. మౌనిక, సంజూ కలిసి వస్తారు. మౌనిక వచ్చింది అనే ఆనందంలో.. ఫోన్ విషయం పక్కన పెట్టేస్తారు. మౌనికను పలకరించడానికి వెళతారు. ఇక మౌనికను చూసి ప్రభావతి, సత్యం, సుశీలమ్మ చాలా సంతోషిస్తారు. ప్రేమగా పలకరిస్తారు. సంజూని పలకరిస్తే.. ప్రతి ఒక్కరికీ కౌంటర్లు వేస్తూ ఉంటాడు. అది చూసి బాలుకి విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది. కానీ.. మీన చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఏమీ అనకుండా ఆగిపోతాడు.

మీనా.. పలకరించమని బలవంత పెట్టడంతో.. బాగున్నారా బావగారు అని పిలుస్తాడు. ఆ మాటకు సంజూ కూడా షాక్ అవుతాడు. కానీ.. దానికి కూడా వెటకారంగానే సమాధానం ఇస్తాడు. ఏదో ఒకటి మాట్లాడండి అని మీనా బలవంత పెట్టడంతో.. మీ కారు బాగుందా? కండిషన్ లోనే ఉందా? అంటూ ఏవేవో ప్రశ్నలు అడుగుతాడు. దానికి చిరాకు పడిన సంజూ.. ‘ హోమం కోసం వచ్చామా లేక.. కారు మెకానిక్ షాప్ కి వచ్చామా?’ అని అడుగుతాడు. ఇలా కాదని.. సంజూతో గౌరవంగా ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేయాలని.. బాలు.. పక్కకు వచ్చి మరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాక్టీస్ లో బాలు మాట్లాడే పదాలు చాలా ఫన్నీగా ఉంటాయి.ఇంతలో బాలు అంతరాత్మ వచ్చి..నీకు సారీ చెప్పడం రాదు.. తిరిగి ఏమీ అనకుండా ఉంటే చాలు అని చెబుతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బాలు ఫోన్ చేజార్చుకున్న రోహిణీ..
Image Credit : Jio Hotstar

బాలు ఫోన్ చేజార్చుకున్న రోహిణీ..

కట్ చేస్తే.. ఇంట్లో అందరూ హోమంలో కూర్చొంటారు. అప్పుడే రోహిణీకి బాలు ఫోన్ గుర్తు వస్తుంది. లేచి వెళ్లి ఫోన్ తీసుకొద్దాం అనుకుంటే.. హోమంలో ఒక్కసారి కూర్చొన్న తర్వాత లేవకూడదు అని ప్రభావతి ఆపుతుంది. అయితే.. ఆ ఫోన్ నేను తెస్తానులే అని వింధ్య వెళ్తుంది. ఇంతలో.. ఈ బొమ్మల కొలువుకు వచ్చిన ఓ పాప.. ఆ ఫోన్ తీసుకొని లైవ్ బ్లాగ్ చేస్తూ ఉంటుంది. వింధ్య చూసి.. ఆ ఫోన్ తనది అని ఇవ్వమని అడిగినా.. ఆ చిచ్చర పిడుగు ఇవ్వదు. ఇందులో నీ ఫోటో ఉందా? చూపించు అని రివర్స్ అవుతుంది. మరో వైపు హోమం జరుగుతూ ఉంటుంది. మొదటి ప్రాధాన్యత సంజూ కి ఇవ్వమని బాలు మధ్యలో పంతులుకు చెబుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఫోన్ తీసుకున్న పాప.. వచ్చి మీనా పక్కన కూర్చొని వీడియో తీస్తూ ఉంటుంది. అది రోహిణీ చూస్తుంది. ఇంతలో హోమం పూర్తి అవుతుంది.

అయితే.. సంజూ కూర్చొంటే.. బాలు ప్రేమగా వచ్చి.. జ్యూస్ ఇస్తాడు. ఆ జ్యూస్ తీసుకోవడానికి సంజూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అంతేకాదు.. బాగా మర్యాద చేసి క్షమాపణలు కూడా చెబుతాడు. తర్వాత భోజనాలకు రమ్మని ప్రభావతి, సత్యం వచ్చి.. సంజూని పిలుస్తారు. అందరూ భోజనాలకు వెళతారు.పాప కూడా ఆ భోజనాల దగ్గరే ఉంటుంది. ఆ పాప కోసం... రోహిణీ, వింధ్య వెతుకుతూ ఉంటే.. ప్రభావతి వచ్చి పిలుస్తుంది. తీరా వీళ్లు అక్కడికి వెళ్లే సరికి.. పాప ఫోన్ చూసుకుంటూ భోజనం చేస్తూ ఉంటుంది. పాప దగ్గర నుంచి ఫోన్ లాక్కోవాలని రోహిణీ ప్రయత్నిస్తుంది. కానీ.. ఆ పాప ఇవ్వదు. మరోవైపు.. సంజూకి బాలు అతి మర్యాద చేస్తూ ఉంటాడు. సంజూ తిప్పలు పడుతూ ఉంటాడు.మరోవైపు.. ఆ పాప దగ్గరకు వెళ్లి ఫోన్ ఏది అని అడిగితే.. ఒక అంకుల్ తీసుకున్నాడు అని చెబుతుంది. ఫోన్ పోయినందుకు రోహిణీ, వింధ్య తిప్పలు పడతారు. ఇక.. బొమ్మల కొలువు దగ్గర ప్రభావతి పాటల ప్రోగ్రామ్ మొదలౌతుంది. ఈ పాట వినలేక అందరూ చెవులు మూసుకుంటారు. సత్యం మాత్రమే.. వన్స్ మోర్ అంటూ అడుగుతాడు. ప్రభావతి మళ్లీ పాడటం మొదలుపెడుతుంది. ఇక.. రోహిణీని పాట పాడమని ప్రభావతి.. శ్రుతిని పాడమని వాళ్ల అమ్మ అంటారు. వాళ్లిద్దరూ మేం పాడలేం అంటే.. మీనాని పాట పాడమని వాళ్ల అమ్మ చెబుతుంది. అయితే.. మీనా మీద ప్రభావతి కౌంటర్లు వేస్తుంది. దానికి బాలు కోపంతో ఊగిపోతాడు. ఈ విషయంలో మీనా గ్రేట్ అని బాలు.. ప్రభావతి గ్రేట్ అని రోహిణీ పోటీ పడి గొడవ పడుతూ ఉంటారు. సుశీలమ్మ మధ్యలో దూరి.. మీనా పాట పాడుతుందని చెబుతుంది. ఇక.. మీనా అద్భుతంగా పాడుతుంది.

33
శుభవార్త చెప్పిన మౌనిక..
Image Credit : Jio Hotstar

శుభవార్త చెప్పిన మౌనిక..

ఇక తర్వాత.. సంజూకి బాలు ప్రసాదం తినిపించాలని చూస్తాడు. సంజూ తనకు వద్దు అని విసుక్కుంటూ ఉంటాడు. అప్పుడే మౌనిక కి వాంతులు అవుతాయి. ఏమైందా అని అందరూ కంగారుపడతారు. సుశీలమ్మ చెక్ చేసి.. మౌనిక ప్రెగ్నెంట్ అని చెబుతుంది. ఆ మాట విని అందరూ చాలా సంతోషిస్తారు. మౌనికకు జాగ్రత్తలు చెప్పి పంపించేస్తారు.వెళ్లే ముందు.. సంజూకి మనస్ఫూర్తిగా బాలు థ్యాంక్స్ చెబుతాడు. మౌనికను బాగా చూసుకోమని చెబుతాడు. మౌనికకు కొడుకే పుట్టాలని.. తనకు కూతురు పుడితే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చాలా ఆనందంగా చెబుతాడు. అయితే.. మౌనిక ప్రెగ్నెంట్ అని తెలిసి సంజూ షాక్ అవుతాడు.మౌనికకు పిల్లలు పుట్టరు అనే వంక చూపించి ఇంట్లో నుంచి గెంటేయాలని తండ్రితో కలిసి వేసిన ప్లాన్ ప్లాప్ అయ్యిందని సంజూ నిరాశపడతాడు. అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుదాం అని బాలు ఫోటో తీస్తాడు. అయితే.. పాప దగ్గర నుంచి బాలునే ఫోన్ తీసుకున్నాడు. ఆ విషయం పాప వచ్చి.. రోహిణీకి చెబుతుంది. ఇక.. మౌనిక ప్రెగ్నెంట్ అయినందుకు బాలు, మీనా చాలా సంతోషపడతారు. అదే విషయం రాత్రికి ఇంట్లో మాట్లాడుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu:ప్రభావతితో పూలు అమ్మించిన మీనా,బొమ్మల కొలువులో రోహిణీ నెత్తిన మరో బాంబు
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved