యంగ్ విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాను ముందు నుండి ప్రోత్సహిస్తోన్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఆదివారం నాడు చిత్రబృందం కోసం స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశాడు.

ఈ పార్టీకి టాక్సీవాలా టీమ్ తో పాటు ఇండస్ట్రీలో కొందరు యువ దర్శకులు, ప్రతిభావంతులను ఆహ్వానించారు. ఈ పార్టీలో మాత్రం విజయ్ దేవరకొండ, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ అందరి దృష్టిని ఆకర్షించారు.

గతంలో అల్లు అర్జున్ ఇదే విధంగా సక్సెస్ అయిన సినిమా టీమ్ ల కోసం స్పెషల్ పార్టీలను నిర్వహించాడు. కీర్తి సురేష్ నటించిన 'మహానటి' సినిమా సక్సెస్ కావడంతో అల్లు అర్జున్, అల్లు అరవింద్ చిత్రబృందం కోసం పెద్ద పార్టీ ఇచ్చారు. ఇటీవల దర్శకుడు పరశురాం రూపొందించిన 'గీత గోవిందం' సినిమా టీమ్ ని కూడా అల్లు అర్జున్ ఇలానే సర్ప్రైజ్ చేశారు.