అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ సెట్ చేసుకున్న విజయ్ దేవరకొండ గీతగోవిందం తో బాక్స్ ఆఫీస్ హీరోగా సెటిల్ అయ్యాడు. అయితే ఊహించని విధంగా నోటా సినిమా విజయ్ విజయాలకు బ్రేక్ వేసింది. దీంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా మరో బాక్స్ ఆఫీస్ హిట్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకోవాలని అనుకుంటున్నాడు. 

విజయ్ దేవరకొండ నుంచి నెక్స్ట్ రానున్న చిత్రం టాక్సీవాలా. జిఏ2 పిక్చ‌ర్స్ - యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేయనున్న ఈ సినిమాకు.రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించాడు. అసలైతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. సప్సెన్స్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానం కావడం వల్ల ఆలస్యమైనట్లు నిర్మాత ఏస్.కె.ఎన్ వివరించారు. 

అదే విధంగా గీత గోవిందంతో విజయ్ రేంజ్ కూడా పెరగడంతో సినిమాను అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉండేలా రూపొందిస్తున్నట్లు వివరించారు..  ఇక ఫైనల్ గా నవంబర్ 16వ తేదీన టాక్సీ వాలా విడుదలను చేయనున్నట్లు చెప్పారు. ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.