ఈ మధ్య కాలంలో వేగంగా యూత్ కి దగ్గరైన హీరో విజయ్ దేవరకొండ. అవకాశం వచ్చిన ప్రతిసారి తానెంటో నిరూపించుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు మరోసారి తన సత్తా చాటాడు. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాలతో బాక్స్ ఆఫీస్ మార్కెట్ పెంచుకున్న విజయ్ నోటా సినిమాతో డల్ అయిన సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు టాక్సీ వాలాతో మళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఈ హీరో. మొదటి రోజు టాక్సీ వాలా వరల్డ్ వైడ్ గా 10.5కోట్లను కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా తెలిపింది. విజయ్ మార్కెట్ సినిమా సినిమాకు పెరుగుతోందని టాక్సీ వాలా నిరూపించింది. రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. 

సినిమాకు పైరేసి చాలా దెబ్బకొడుతుందని టాక్ వచ్చినప్పటికీ విజయ్ తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక అతని ఫాలోవర్స్ సినిమాకు మంచి టాక్ ను క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మిగతా రోజుల్లో కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉంది. మరి విజయ్ ఏ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటాడో చూడాలి.