రెండేళ్లుగా బాలకృష్ణ సినీ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ జరగలేదు. నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి మోక్షజ్ఞ కూడా ఎదురుచూస్తున్నాడు.

అమెరికాలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అలానే క్రిష్ డైరెక్ట్ చేసిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సినిమాల పట్ల కాస్త అవగాహన తెచ్చుకున్నాడు. మోక్షజ్ఞని ఎవరు పరిచయం చేస్తారనే విషయంలోక్రిష్, వినాయక్ వంటి దర్శకుల పేరు వినిపించాయి.

కానీ బాలకృష్ణ ఆలోచన మాత్రం మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన కొడుకు ఎంట్రీకి పూరి జగన్నాథ్ మాత్రమే కరెక్ట్ అని భావిస్తున్నాడు బాలయ్య. ఈ మేరకు పూరి జగన్నాథ్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు. దాదాపు పూరి పేరు ఖాయమని అంటున్నారు.

త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన రానుంది. స్టార్ హీరోల కొడుకులను పరిచయం చేయడంలో పూరికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. రామ్ చరణ్, పునీత్ రాజ్ కుమార్, ఇషాన్  వంటి హీరోల డెబ్యూ సినిమాలు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసినవే.. మరి మోక్షజ్ఞకి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి!