గత కొన్ని నెలలుగా రిలీజ్ డేట్స్ విషయంలో ఆడియెన్స్ ని కన్ఫ్యూజ్ చేసిన టాక్సీ వాలా చిత్ర యూనిట్ ఫైనల్ గా ఒక డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ లోనే రిలీజ్ కావాల్సిన టాక్సీవాలా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఇక ఫైనల్ గా గీత ఆర్ట్స్ - యువీ క్రియేషన్స్ కలవడంతో సినిమాను 17వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.  

ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ రీసెంట్ గా పూర్తి చేసిన టాక్సీ వాలా యూనిట్ సెన్సార్ వర్క్ ను కూడా ఫినిష్ చేసుకుంది. సూపర్ న్యాచురల్ కామెడీ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. హారర్ సీన్స్ అలాగే విజయ్ దేవరకొండ కామెడీ సన్నివేశాలు బావున్నాయనే టాక్ వస్తోంది. గత చిత్రాలకంటే విజయ్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడట. 

గ్రాఫిక్స్ సీన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్ అని తెలుస్తోంది. నోటా సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ ఈ సినిమాతో తప్పకుండా హిట్టు కొట్టాలి. బడా బ్యానర్స్ నుంచి సినిమా రిలీజ్ అవుతుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ నెల 11న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు.