తమ సినిమా రిలీజ్ కాకముందే పైరసి అవ్వటం ఎవరికైనా చాలా బాధాకరమైన విషయమే. మరీ ముఖ్యంగా ఆ పైరసీ లింక్ లను, వీడియోలను సోషల్ మీడియాలో యూత్ షేర్ చేస్తూంటే.. దర్శక,నిర్మాతలకు ఏం చేయాలో అర్దం కాదు. పెట్టిన కేసులే తేలక, ఇప్పుడీ కొత్త సమస్యలతో వారి బాధ వర్ణనాతీతం. కేవలం దర్శకుడు, నిర్మాతకే కాదు.. ఎంతో ఎఫర్ట్ పెట్టిన టెక్నీషియన్స్ కూడా తమ శ్రమ ఇలా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిపోతుందే అనిపిస్తుంది. 

ఇప్పుడు అదే పరిస్దితిని ‘టాక్సీవాలా’ టీమ్ ఎదుర్కొంటోంది. దాంతో ఆ చిత్రం దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ తమ ఆవేదనను ఫేస్ బుక్ లో పోస్ట్ గా పెట్టారు. దర్శకుడు  రాహుల్‌ ఏమంటున్నారో ఈ క్రింద చూడండి. 

ఇక ఇదే విషయమై ఈ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ..సుజిత్ సారంగ్ పోస్ట్ చేస్తూ...తానను కొద్ది కాలం కాలం గాయపడ్డ విషయం గుర్తు చేసుకుంటూ డాక్టర్ తనను ప్రొఫెషన్ మారమన్నారు అని, అయినా సినిమాపై ప్రేమతో ఇలా కంటిన్యూ అవుతున్నానని అన్నారు. 

విజయ్ దేవరకొండ సినిమాలకు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా గీతాగోవిందం సినిమా తర్వాత ఈ క్రేజ్‌ రెట్టింపు అయ్యింది. ఇదే క్రేజ్ ను పైరసీ బ్యాచ్ క్యాష్ చేసుకుంటోంది. రిలీజ్ కు ముందే పైరసీ చేసేస్తున్నారు. గీత గోవిందం సినిమా కూడా విడుదలకు ముందే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇదే బాటలో   టాక్సీవాలా సినిమా. ఇది నిజంగా దురదృష్టకర పరిణామం.