Asianet News TeluguAsianet News Telugu

దూసుకెళ్తున్న తమిళ స్టార్ హీరో ధనుష్.. ఆసక్తికరంగా నేనే వస్తున్నా టీజర్

తమిళతో పాటు తెలుగులో కూడా దూసుకుపోతున్నాడు తమిళ స్టార్ హీరో ధనుష్. తెలుగు డైరెక్ట్ సినిమాలు చేస్తున్న ధనుష్.. తమిళ సినిమాలను వరుసగా డబ్బింగ్ చేసుకుంటూ..మరింత పాపులర్ అవుతున్నాడు. 
 

Tamil Hero Dhanush Nene Vastunna Movie teaser
Author
First Published Sep 15, 2022, 10:10 PM IST

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ నానే వరువెన్. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీని ధనుష్ అన్న  సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే  నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. తాజాగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్  చేశారు మూవీటీమ్. 

రిలీజ్ చేసిన టీజర్ లో ధనుష్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. ఎంతో ఆసక్తి కరంగా ఉన్న ఈ మూవీ టీజర్  ఆడియన్స్ ను అలరిస్తోంది. క్లాస్ రోల్ లోను, అలానే రస్టిక్ లుక్ లోను ధనుష్ ను ఈ టీజర్ లో చూడొచ్చు.యువన్ శంకర్ రాజా అందించిన బాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ గా ఉంది. కాదల్ కొండేన్, పుదుపేట్టై, మయక్కం ఎన్న తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగోవ సినిమా ఇది.  

 

హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న నాటుగోవ సినిమా కావడంతో  ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.ఈ చిత్రంలో ధనుష్ తో పాటు యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్ మరియు ఎల్లి అవ్రామ్ కూడా ఈ చిత్రంలో నటించారు. కలై పులి ఎస్ థాను తను నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios