బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీ లియోనీ సైన్ చేసిన మరో తెలుగు సినిమా ‘వీర మహాదేవి’. యుద్ధ సన్నివేశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీతో వీర నారిగా సన్నీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను మంగళవారం నాడు చెన్నైలో కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసింది సన్నీ. తమిళ దర్శకుడు వడివుడైయన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ‘వీర మహాదేవి’ రెగ్యులర్ షూటింగ్ ఈరోజు వైభవంగా ప్రారంభమైంది. తమిళంలో ఈ మూవీని ‘వీరమదేవి’గా తెరకెక్కుతోంది.

చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘వీర మహాదేవి’ చిత్రంతో సన్నీలియోన్ ఒక పూర్తిస్థాయి తెలుగు సినిమా చేయనుండటం ఆమె ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పిరియాడిక్ వార్ డ్రామా ‘వీర మహాదేవి’ సన్సేషన్స్ క్రియేట్ చేయడం ఖామమే అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మొత్తానికి పోర్న్‌స్టార్ స్థాయి నుండి ఐటమ్ బాంబ్‌గా మారిన సన్నీ లియోన్ పూర్తి స్థాయి తెలుగు సినిమాలో నటిస్తుండటంతో.. ఆమె కత్తి విన్యాసాలను వీక్షించేందుకు ప్రేక్షకులు భారీగా టాకీసులకు వస్తారని మేకర్స్ నుండి వినిపిస్తున్న మాట. ఇక ‘వీర మహాదేవి’ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

 

శృంగార తార‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించిన సన్నీలియోన్.. ఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో హాట్ హాట్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేస్తుంది. తనదైన శైలిలో అందాలను అస్సలు దాచుకోకుండా ఆరబోస్తూ కనువిందు చేస్తుంది. జిస్మ్ 2 మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీలియోన్‌ వరుస ఐటమ్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటుంది. రయీస్ సినిమాలో షారూఖ్ ఖాన్‌తో కలసి చిందేసిన ఈ చిన్నది తాజాగా సంజయ్ దత్ ‘భూమి’ సినిమాలో ‘ట్రిప్పి ట్రిప్పి’ అంటూ ఒక ఐటెం సాంగ్‌‌లో తడి తడి అందాలతో కుర్రకారులో కాకరేపింది. ఇటీవల రాజశేఖర్ నటించిన గరుడవేగ మూవీలోనూ ‘డియో.. డియో’ అంటూ ఐటమ్ బాంబ్ పేల్చింది.