Asianet News TeluguAsianet News Telugu

వారంలో జాహ్నవి పుట్టినరోజు.. శ్రీదేవి ఏం ప్లాన్ చేసిందో తెలుసా..

  • అతిలోక సుందరి జాహ్నవి కూతురు పుట్టిన రోజు మార్చి 7న
  • ఇంతలోనే లోకం విడిచి వెళ్లిపోయిన శ్రీదేవి
  • జాహ్నవి పుట్టినరోజు కోసం శ్రీదేవి ఏం ప్లాన్ చేసింది
sridevi daughter jahnavi birthday in a week

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి మరో వారం రోజుల్లో తన గారాలపట్టి 'జాహ్నవి' పుట్టిన రోజు ఉందగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. మార్చి 7 నాడు జాహ్నవి 21 ఏట అడుగుపెట్టబోతోంది. తల్లిలేకుండా జాహ్నవికి ఇదే మొట్ట మొదటి పుట్టిన రోజు. శ్రీదేవి జీవితంలో జాహ్నవి స్థానం ప్రత్యేకం. జాహ్నవి మొదటి సంతానం కావడం, అందునా ఆడపిల్ల కావడంతో శ్రీదేవికి ముందు నుంచి జాహ్నవిపై అమితమైన ప్రేమ.
 

 

శ్రీదేవి ఎక్కడికెళ్లినా తన కూతురు జాహ్నవిని వెంటబెట్టుకొని వెళ్లేది. తల్లికూతుళ్ల మాదిరిగా కాకుండా మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. ఇంతటి సాన్నిహిత్యం ఉన్న తల్లికూతుళ్లు బాలీవుడ్‌లో కూడా చాలా అరుదు. కూతురితో దిగే ఫొటోలను ఎప్పటికప్పుడు 'ఇన్స్‌టాగ్రాం' ఖాతాలో పోస్టు చేసుకునేది.

 

నిజానికి జాహ్నవి సినిమాల్లోకి రావడం శ్రీదేవికి ఇష్టం లేదు. మరేదైనా కెరీర్ ఎంచుకోవాలని కోరుకునేది. అయితే జాహ్నవికి సినీరంగంపై అమితమైన ఆసక్తి ఉండడంతో కాదనలేకపోయింది. తల్లిగా కూతుర్ని సమర్థించడం తన బాధ్యత అని పలుసార్లు సన్నిహితులతో చెప్పుకునేది. అందుకే జాహ్నవి 'డెబ్యూ' సినిమా 'ధడక్' పనులన్నీ దగ్గరుండి మరీ చూసుకుంది. ఈ సినిమా జులై 20 విడుదల కాబోతోంది. దురదృష్టవశాత్తు తన కూతురు మొట్ట మొదటి సినిమాను కూడా చూడకుండానే శ్రీదేవి తుదిశ్వాస విడిచింది.

 

మరోవైపు కిందటి ఏడు జాహ్నవి పుట్టిన రోజు నాడు జాహ్నవి చిన్ననాటి ఫొటోలను శ్రీదేవి 'ఇన్స్‌టాగ్రాం'లో పోస్టు చేసింది. ఈసారి హిరోయిన్ గా క్రేజ్ సంపాదించింది కాబట్టి జాహ్నవి పుట్టినరోజును గ్రాండ్ గా బాలీవుడ్ సెలెబ్స్ అందరినీ పిలిచి సెలిబ్రేట్ చేయాలని శ్రీదేవి ప్లాన్ చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి కూతురు జాహ్నవి పుట్టినరోజునను సెలిబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభించిందట. కానీ ఆలోపే అతిలోక సుందరి బాలీవుడ్ చాందినీ తీరని లోకాలకు వెళ్లిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios