లాక్‌డౌన్‌లో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరోగా నిలిచారు సోనూసూద్. తాజాగా మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే అతిపెద్ద బ్లడ్ డోనర్ యాప్‌ని ప్రారంభించారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నటుడు-మానవతావాది సోనూ సూద్ మంగళవారం మరో కలల ప్రాజెక్ట్ UBLOOD యాప్‌ను మా వ్యవస్థాపకుడు జగదీష్ యలమంచిలి మరియు చైర్మెన్ కృష్ణ మూర్తి యలమంచిలి సహాయంతో హైదరాబాద్ లోని ఆవాస హోటల్‌లో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొబైల్ అప్లికేషన్ UBLOOD నుండి పొందగలిగే సేవల గురించి సోనూ సూద్ తెలిపారు.
ఇందులో ఆయన మాట్లాడుతూ.. `కరోనా సెకెండ్ వేవ్ సమయంలో, మేము దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు రక్తాన్ని పంపుతున్నాం. వాట్సాప్, టెలిగ్రామ్‌లో ప్లాస్మా గ్రూపులను ఏర్పాటు చేశామని నాకు గుర్తుంది. కొంతమంది వ్యక్తులు వాటిని సమన్వయం చేసుకుంటూ పేషెంట్‌లకు చేరవేయడానికి వారంతా చాలా కష్టపడ్డారు. అప్పుడే నాకు ఆటోమేటిక్‌గా కోఆర్డినేట్ అయ్యే ప్లాట్‌ఫారమ్ కలిగి ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. దాంతో మా వ్యవస్థాపకుడు జగదీష్ యలమంచిలి, చైర్మెన్ కృష్ణ మూర్తి యలమంచిలి సహాయంతో ఈ UBLOOD యాప్ ను ప్రారంభించడం జరిగింది.
ప్రతి వ్యక్తి తమ స్మార్ట్‌ఫోన్‌లో UBLOOD యాప్ కలిగి ఉండాలి.అప్పుడే సోషల్ మీడియా పోస్ట్‌లపై ఆధారపడకుండా వారి పరిధిలోని దాతల నుండి UBLOOD యాప్ సహాయంతో తక్షణమే ఎవరికీ (రోగులకు, బాధితులకు) ఏ ఆపద వచ్చినా వెంటనే వారి ప్రాణాలను కాపాడిన వారమవుతామమని తెలిపారు. ఇంకా చెబుతూ, `యాక్సెస్ బిలిటీ లేని మారుమూల గ్రామంలో నివసించే ఎవరైనా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈ UBLOOD యాప్ ద్వారా సహాయం పొందవచ్చు. నాకు బాగా గుర్తుంది. ఢిల్లీలో ఒక వ్యక్తికి అత్యవసరంగా రక్తం అవసరం పడితే ఫుల్ కరోనా ఉన్నపుడు ఒక వ్యక్తి కర్నాల్ నుండి 100 కి.మీ.ల వరకు రావడానికి అంగీకరించాడు.అయితే ఇలాంటి UBLOOD యాప్ ఉండడం వలన ఆ సమయంలో, సమీపంలోని ప్రదేశం నుండి ఎవరైనా దాతలు సహాయం చేయడానికి ముందుకు రావచ్చని భావించాన`ని చెపారు సోనూ సూద్.
UBLOOD యాప్ యొక్క చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్, వధన్ మాట్లాడుతూ,`మేము తీసుకున్న మొదటి అడుగు కమాండ్ సెంటర్‌ను అన్ని బాషలకు మార్చడం జరుగుతుంది. దీంతో ఇక్కడ ఎవరైనా కాల్ చేసి వారి అవసరాలను వారి భాషలో వివరించవచ్చు. మా బృందం దాతను గుర్తించడంలో ఆసుపత్రితో కనెక్ట్ కావడంలో వారికి సహాయం చేస్తుంద`న్నారు.
UBlood మీకు ఎలా సులభతరం చేస్తుంది;
-మీ లొకేషన్‌ను ఎంటర్ చేయండి మరియు మీకు సమీపంలోని క్లోసెట్ సామీప్యతలో అందుబాటులో ఉన్న దాతలు మీకు అదే రక్తంతో చూపబడతారు.
-ఒక వ్యక్తి UBlood యాప్ ద్వారా రక్తం కోసం అభ్యర్థనను పొందవచ్చు, అభ్యర్థనను నెరవేర్చడానికి సమీపంలోని స్వచ్ఛంద దాతను కనుగొనవచ్చు.
-ఇకపై రక్తాన్ని స్వీకరించడంలో జాప్యం లేదు. నిజ సమయంలో దాతలు మరియు గ్రహీతలతో కనెక్ట్ అవ్వండి.
-రక్త అభ్యర్థనలపై అప్‌డేట్‌లను పొందండి, తద్వారా దాత అందుబాటులో ఉన్నప్పుడు లేదా అభ్యర్థన చేసిన వెంటనే మీకు తెలియజేయబడుతుంది.
రక్తం సకాలంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణం కోల్పోకుండా చూసుకోవడం. స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి, సంక్షోభం మరియు అత్యవసర సమయంలో ఎవరూ నిస్సహాయంగా మరియు ఒంటరిగా ఉండకుండా ఉండటానికి మేము వ్యక్తులను ఒకరికొకరు కనెక్ట్ చేస్తాము. సరఫరా మరియు డిమాండ్ మధ్య ఈ అంతరాన్ని తగ్గించడంలో మాకు సహాయం చేయడంలో మా సోషల్ మీడియా ఉనికి ద్వారా పౌరులు, సంస్థలు కీలక పాత్ర పోషించేలా చేస్తామని చెప్పారు.
