Asianet News TeluguAsianet News Telugu

శ్రధ్దా కపూర్ పై నెటిజన్ల ఆగ్రహం.. ట్రోలింగ్

  • శ్రద్ధా కపూర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
  • విద్యాబాలన్ కు మద్దతుగా ట్వీట్ చేసిన పరిణితికి మద్దతు
  • దాంతో స్లిమ్,ట్రిమ్ అంటూ యాడ్ ఎందుకు చేశావని నెటిజన్ల ఫైర్
shraddha kapoor trolled for her comments

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 'తుమ్హారీ సులు' సినిమాలో విద్యాబాలన్ 'రేడియో జాకీ' (ఆర్జే) గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విద్య ‘సులోచన’ అనే మిడిల్ క్లాస్ లెడీ పాత్రలో నటించింది. గతంలో పరిణీతి చోప్రా కూడా లావుగా ఉండడంతో అలాంటి విమర్శలే ఎదుర్కొంది. అనంతరం పరిణీతి చోప్రా వర్కౌట్స్ చేసి స్లిమ్ గా మారిన సంగతి తెలిసిందిే 

 

కాకపోతే ఈ మద్య విద్యాబాలన్ తన పర్సనాలిటీ గురించి సమర్థించుకుంటూ నెటిజన్లకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో విమర్శలు రావడంతో ఆమెకు మద్దతుగా శ్రద్ధా కపూర్ అలనాటి హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మార్లిన్ మన్రో ఫోటోను పోస్టు చేస్తూ... 'ఆమె పొట్టటోన్డ్ కాదని, ఆ శరీరం బిగుతుగా ఉండదని, అయినా ఆమె ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరణతో పాటు శృంగార దేవతగా నీరాజనాలు అందుకుందని గుర్తు చేస్తూ...శరీర సౌష్టవం అనేది వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఉంటుంద'ని తెలుపుతూ ఫోటో పోస్టు చేసింది.

 

దీనిపై ఇప్పుడు నెటిజన్లు శ్రద్దా కపూర్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి శరీరం వారి ఇష్టం అన్నపుడు 'స్లిమ్  గా ఉండండి.. స్లిమ్ గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. రోజూ గ్రీన్ టీ తాగండి అని ఎందుకు చెబుతున్నావు? డబ్బు కోసం ఎంతకైనా దిగజారతావా?..హిపోక్రైట్' అంటూ నిలదీస్తున్నారు. కాగా, లిప్టన్ గ్రీన్ టీ యాడ్ లో శ్రద్ధాకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios