కెమేరామెన్ గంగతో రాంబాబు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఎవడు సినిమాలో అయ్యో పాపం అంటూ పాడిన భామ అంటే మాత్రం టక్కుమని గుర్తుకొచ్చేయడం ఖాయం. బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో కూడా ఐటెం సాంగ్ లో కనిపించిన ఈ భామ పేరు స్కార్లెట్ మెల్లిష్ విల్సన్. ఈ బ్యూటీ ఫ్లోరిడా బీచ్ ఇలా మెరిసింది. అక్కడి నుండి హాట్ ఫోటోలను నెట్ లో షేర్ చేస్తూ.. కుర్రకారులో వేడి పెంచేస్తోంది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి ఆ  బ్రాండ్లను పొగిడి డబ్బులు చేసుకోవడం అనే స్కీమ్ ని బాగానే పాటించేస్తోంది. కాకపోతే ఉట్టినే పోస్టులు పెడితే ఇంట్రెస్ట్ ఉండదు కదా.. అందుకే అందాల ప్రదర్శనతో వీటిని రంగరించి.. బ్రాండింగ్ చేసుకుంటోంది. ఇంగ్లండ్ నుంచి వచ్చి ఇక్కడ ఐటెం సాంగులు చేసి ఇమేజ్ తో పాటు డబ్బులు కూడా బాగానే సంపాదించుకున్న ఈ భామ..  హిందీ టీవీ యాక్టర్ ప్రవేష్ రానాను రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది.