సక్సెస్ మీట్ లో కుర్రాళ్ల మతి పోగొట్టిన తొలిప్రేమ భామ

First Published 15, Feb 2018, 5:33 PM IST
Sapna pabbi killing with her hot looks
Highlights
  • కుర్రాళ్ల మతి పోగొట్టిన తొలిప్రేమ భామ
  • సునోనా సునైనా సాంగ్ లో మెరిసిన సప్నా పబ్బి
  • తొలిప్రేమ సక్సెస్ మీట్ ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సప్నా

వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రం ఘనవిజయం సాధించింది. వరుణ్, రాశి ఖన్నా సహా ఈ చిత్రంలో నటించిన అందరికి ప్రశంసలు దక్కాయి. ఓ భామ మాత్రం కుర్ర కారు హృదయాలలో చిన్న పాటి అలజడిని రేపి మాయమైపోయింది. సునోనా.. సునైనా అనే సాంగ్ లో అలా మెరిసి ఇలా మాయమైపోయే ఆ భామే సప్నా పబ్బి.సప్నా పబ్బి పేరుగాంచిన బ్రిటిష్ మోడల్.

ఇప్పుడిప్పుడే ఇండియాలో సినిమా ఛాన్సుల వేట మొదలు పెట్టింది. బాలీవుడ్ లో కామోషియాన్ అనే హర్రర్ చిత్రంతో సప్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ భామకు గుర్తింపు దక్కలేదు. సప్నా బ్రిటిష్ సుందరి కావడంతో అందాల ఆరబోతకు ఏ మాత్రం మొహమాట పడదు. అందుకే మోడలింగ్ లో బాగా రాణించింది. తొలిప్రేమ చిత్రం తరువాత యువత వెతకడమే కాక ఈ భామ  ఇని స్టాగ్రామ్ లోకి కూడా దూరేస్తున్నారు. 

తొలిప్రేమ చిత్రంలో సప్నా మెరిసేది కేవలం ఓ సాంగ్ లో మాత్రమే. అయినా కూడా ఈ బ్యూటీ కుర్రాళ్ళ మైండ్ కు ఎక్కేసింది.  ఇక తొలిప్రేమ సక్సెస్ మీట్ లో సప్నా అందాల కనువిందు చేసింది. దాచి దాయని అందాలతో కుర్రోళ్లని మరోసారి హీటెక్కించింది. ఈ బ్రిటిష్ బ్యూటీకి సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దానికి కారణం ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో కొనసాగిస్తుండడమే. తొలిప్రేమ చిత్రం ద్వారా టాలీవుడ్ దృష్టిలో పడింది. పూర్తి స్థాయి హీరోయిన్ గా ఒక్క ఛాన్స్ దొరికే టాలెంట్ చూపించాలని ఉవ్విళ్లూరుతోంది.


 

loader