Asianet News TeluguAsianet News Telugu

పెళ్ళి తర్వాత సమంత నాగచైతన్య కాంబినేషన్ మూవీ

  • సమంత, నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ హిట్
  • పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్న సామ్
  • తాజాగా పెళ్తి తర్వాత సమంత నాగచైతన్య కాంబినేషన్ మూవీ రెడీ
samantha nagachaitanya combination movie again

నాగ చైతన్య - సమంత జంటగా నటించిన చిత్రాలు ఎంత హిట్టయ్యాయో తెలిసిందే. వీళ్లిద్దరూ ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నారు. చైతూ సమంత ఫ్యాన్స్ వీళ్లు మరో సినిమా చేస్తే బాగుండని ఆశపడుతున్నారు. గత కొంత కాలంగా అక్కినేని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ కూడా వస్తోంది. నాగ్ కూడా చాలా సార్లు తప్పకుండా ఉంటుందని స్పందించారు. ఆ మధ్య రెండు మూడు సినిమాలు వస్తున్నాయని కొన్ని రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా మారుతి - శైలజ రెడ్డి అల్లుడులో నటిస్తున్నారు అనే టాక్ వచ్చింది. కానీ ఏవి ఫైనల్ కాలేదు. 
 

అభిమానుల కోరిక మరికొన్ని రోజుల్లో నెరవేరబోతోంది. రచయితగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ వారిద్దరిని వెండితెరపై చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కోన వెంకట్ నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిన్నుకోరి సినిమాకు డివివి. దానయ్య తో కలిసి సహా నిర్మాతగా వ్యవహరించిన ఆయన ఎట్టకేలకు హిట్ అందుకున్నారు. అయితే రీసెంట్ గా అదే దర్శకుడితో మరొక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 


నాగ చైతన్య - సమంత అందులో నటించనున్నారు.  నిన్ను కోరి సినిమా తరువాత చైతు ఆ దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన కథకు ఒకే చెప్పేశాడు. ఇక హీరోయిన్ గా సమంత అయితే బావుంటుందని కోన వెంకట్ గారు ఆ కాంబినేషన్ ని ఎట్టకేలకు సెట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టి త్వరలో సినిమాను స్టార్ట్ చేయాలనీ చేస్తున్నారు. ప్రస్తుతం చైతు సవ్యాసాచి సినిమాతో బిజీగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios