Asianet News TeluguAsianet News Telugu

Salman Khan : సల్మాన్ ఖాన్ ‘మే ఛలా’ సాంగ్ రిలీజ్.. సల్లూబాయ్ కి జోడిగా ‘ప్రగ్య జైస్వాల్’ స్టెప్పులు..

బాలీవుడ్ కండల వీరుడు, ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ‘సల్లూ బాయ్’ (Salman Khan) సరికొత్త పాట ‘మే ఛలా’తో అభిమానుల ముందుకొచ్చాడు. ఇదివరకే ఈ సాంగ్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు సాంగ్ మేకర్స్. 

Salman Khan Main Chala Video Song Released, Social Media Post
Author
Hyderabad, First Published Jan 22, 2022, 1:00 PM IST

బాలీవుడ్ కండల వీరుడు, ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ‘సల్లూ బాయ్’ (Salman Khan) సరికొత్త పాట ‘మే ఛలా’తో అభిమానుల ముందుకొచ్చాడు. ఇదివరకే ఈ సాంగ్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు సాంగ్ మేకర్స్. ఈ క్రమంలో టీజర్ మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ సాంగ్ య్యూటూబ్ లో దూసుకుపోతోంది. 

రోమాంటిక్ హీరో సన్మాన్ ఖాన్, హీరోయిన్ ప్రాగ్య జైస్వాల్ నటించిన ‘మే ఛలా’ సాంగ్ ప్రస్తుతం య్యూటూబ్ లో ట్రెండ్ అవుతోంది.  లవ్ అంథిమ్ గా వచ్చిన ఈ  వీడియో సాంగ్ చాలా మెలోడీగా ఉంది. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే దాదాపుగా 4లక్షల వ్యూవ్స్ లభించాయి. ప్రధానంగా రోమాంటిక్ లిరిక్స్, క్యాచీ ట్యూన్ ఉండటంతో సాంగ్ దూసుకెళ్తోంది. 

ఈ సాంగ్ ను టీ-సిరీస్, గుల్ స్మాన్ సమర్పణలో సాంగ్ రూపొందింది.  కాగా సాంగ్ కు  గాత్రం గురు రన్దావా మరియు లులియా వంటుర్ అందించగా, లిరిక్స్ మరియు సాంగ్ కంపోసర్ గా షబీర్ అహ్మద్ సహకారం అందించారు. కొరియోగ్రఫీ షబీనా ఖాన్, డీవోపీగా కరన్ రావత్ పనిచేశారు. కాగా సాంగ్ ను షబీనా ఖాన్ డైరెక్ట్ చేశారు. సల్మా ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు. 

మనసును కదిలిచేలా ఉన్న లిరిక్స్, క్యాచీ టూన్ ఉండటం, సింగర్స్ ప్రాణ పెట్టి సాంగ్ ను పాడటంతో ఆడియోన్స్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, సల్మాన్ ఖాన్, ప్రాగ్యా జైస్వాల్ ఇద్దరు సరిజోడిగా ఉన్నారు. కాగా సాంగ్ రిలీజ్ అయిన సందర్భంగా తన సోషల్ మీడియాలో లింక్ ను షేర్ చేసింది ప్రాగ్య. ఈ సాంగ్ రిలీజైనందుకు సంతోషంగా ఉందని తెలిపింది. మరో వైపు సల్మాన్ ఖాన్ కూడా తన సోషల్ మీడియా అఫిషియల్ ఖాతాలో లింక్ ను షేరు చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ దూసుకుపోతోంది. 

 

కాగా, తాజాగా సల్మాన్ ఖాన్ ఇటీవల పలు వివాదాలకు గురవుతున్నారు. సల్మాన్ ఖాన్ తన పొరుగున ఉన్న కేతన్ కక్కడ్‌పై పరువునష్టం కేసు వేశారు. కేసు తాజా విచారణ సందర్భంగా, నిందితులు తన మతపరమైన గుర్తింపును అనవసరంగా వివాదంలోకి లాగారని సల్మాన్ ఆరోపించారు. సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాది ప్రదీప్ గాంధీ ఈ కేసును టేక్ అప్ చేశారు. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ తన న్యాయవాది ద్వారా స్పందిస్తూ, ‘సరైన రుజువు లేదు. ఈ ఆరోపణలన్నీ ప్రతివాది ఊహకు సంబంధించినవే. ఆస్తి వివాదంలో నా వ్యక్తిగత ప్రతిష్టను ఎందుకు దిగజార్చుతున్నావు. మతాన్ని ఎందుకు తెస్తున్నారు? నా తల్లి హిందువు, నా తండ్రి ముస్లిం మరియు నా సోదరులు హిందువులను వివాహం చేసుకున్నారు. మేము అన్ని పండుగలను జరుపుకుంటామని బదులిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios