Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో నిబంధనలు పెట్టుకోను- సాయి పల్లవి 

సాయి పల్లవి చేసే పాత్రలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి.సినిమాలో  హీరోకి సమానమైన నిడివి, ప్రాధాన్యత సాయి పల్లవికి ఉంటుంది. ఈ క్రమంలో సాయి పల్లవి సినిమాల ఎంపిక ఎలా చేస్తారనే క్యూరియాసిటీ ఉంది. దీనికి తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు

sai pallavi says she wont prepare for a role she going to do
Author
First Published Oct 7, 2022, 12:22 PM IST


ఫిదా మూవీతో తెలుగులో బీభత్సమైన పాపులారిటీ తెచ్చుకుంది సాయి పల్లవి. దర్శకుడు శేఖర్ కమ్ముల కథను ఆమె పాత్ర చుట్టూ రాసుకున్నారు. ఫిదా మూవీలో వరుణ్ తేజ్ హీరో అన్న భావన కలదు. ఆయన జస్ట్ ఓ రోల్ చేశారనిపిస్తుంది. ఫిదా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. హిట్ క్రెడిట్ మొత్తం సాయి పల్లవిదే. ఫిదా తర్వాత సాయి పల్లవి చేసిన పడి పడి లేచే మనసు, ఎంసిఏ చిత్రాల్లో కూడా సాయి పల్లవి పాత్ర స్ట్రాంగ్ ఉంటుంది. 

శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మూవీలో సాయి పల్లవి కి మరో అద్భుతమైన రోల్ రాశారు. ఫిదా అంత కాకపోయినా లవ్ స్టోరీ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇక శ్యామ్ సింగరాయ్ మూవీలో తక్కువ నిడివి కలిగిన పాత్రలో ఎక్కువ మార్కులు కొట్టేసింది.  సాయి పల్లవి సినిమాలు గమనిస్తే ఇంత గొప్ప పాత్రలు ఆమెకు యాదృచ్ఛికంగా వస్తున్నాయా లేక ఆమె సెలక్షన్ గొప్పదనమా? అనే సందేహం కలగక మానదు. 

అయితే దీనిపై సాయి పల్లవి స్పందించారు. తన సినిమా సెలక్షన్ ఎలా ఉంటుందో ఆమె వెల్లడించారు. సాయి పల్లవి మాట్లాడుతూ ఒక పాత్ర ఇలానే చేయాలనే నిబంధనలు నేను పెట్టుకోను. అలాగే చేయబోయే పాత్ర కోసం ముందుగానే సన్నద్ధం కాను. నా పెర్ఫార్మన్స్ సెట్ వాతావరణం, తోటి నటులపైన ఆధారపడి ఉంటుంది. నా పాత్రకు వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని ఆమె చెప్పారు. 

సడన్ గా సాయి పల్లవి సినిమాలు తగ్గించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన సాయి పల్లవి ఖాళీగా ఉండటం ఏమిటో అంతుపట్టడం లేదు. సాయి పల్లవి లేటెస్ట్ మూవీ గార్గి విడుదలై చాలా రోజులు అవుతుంది. ఆమె కొత్త మూవీ ప్రకటన చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం సాయి పల్లవి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios