Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ని తొక్కేయాలని చూసినా.. స్టార్డంతో ఎదిరించి నిలబడ్డాడు..!

బాలీవుడ్ లో ప్రభాస్ స్టామినా మరోమారు రుజువు చేసిన చిత్రం సాహో. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాహో అనూహ్యంగా తెలుగులో మిక్స్డ్ రిజల్ట్ అందుకొని, హిందీలో భారీ హిట్ కొట్టింది. ఐతే సాహో సినిమాను బాలీవుడ్ తొక్కేయాలని చూసింది. 
 

saaho proved prabhas stardom in bollywood
Author
Hyderabad, First Published Aug 30, 2020, 8:43 AM IST

ప్రభాస్ రేంజ్ ని అమాంతంగా పెంచేసింది బాహుబలి . వేల కోట్ల వసూళ్లతో ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తరువాత బాలీవుడ్ తో పాటు ఇతర దేశాలలో కూడా ప్రభాస్ కి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. నిజానికి బాహుబలి విజయం పూర్తిగా దర్శకుడు రాజమౌళి ఖాతాలో వేసేశారు. అది రాజమౌళి చేసిన మాయ, ప్రభాస్ నెక్స్ట్ మూవీ బాలీవుడ్ లో హిట్ కొట్టడం గగనం అనుకున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన మరో పాన్ ఇండియా చిత్రం సాహోకి బాలీవుడ్ లో పరాజయం తప్పదని చాలా మంది భావించారు. 

 ఒక ప్రాంతీయ భాషా చిత్రం అయిన బాహుబలి  బాలీవుడ్ లో ఆ స్థాయి విజయం సాధించడం ద్వారా వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించింది.దీనితో హీరో ప్రభాస్ పై బాలీవుడ్ కుట్ర పన్నింది. సాహో కూడా విజయం సాధించిన పక్షంలో ప్రభాస్ బాలీవుడ్ లో పాతుకుపోతాడు, మనకు పోటీవస్తాడని భావించిన బాలీవుడ్ స్టార్స్ సాహోని తొక్కేయాలని గట్టి ప్లాన్ లో ఉన్నారు. దీని కోసం ఇద్దరు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్స్ ని సెట్ చేసిపెట్టుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 30న సాహో ఐదు భాషలలో గ్రాండ్ గా విడుదలయ్యింది. 

సౌత్ లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీలో హిందీలో డిజాస్టర్ రేటింగ్స్ తెచ్చుకుంది. తరణ్ ఆదర్శ్, రాజీవ్ మసంద్ లాంటి క్రిటిక్స్ సాహోలో అసలు విషయమే లేదు అన్నారు. దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. దీనితో సాహో కి అక్కడ ఘోర పరాజయం  తప్పదు అన్నారు. అనూహ్యంగా రోజురోజుకు కలెక్షన్స్ పుంజుకుంటూ మౌత్ టాక్ తో సాహో హిందీలో హిట్ కొట్టింది. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు పంచింది. అలా బాలీవుడ్ ప్రభాస్ ని తొక్కేయాలని చూసినా తన స్టార్డం తో ఎదిరించి నిలబడ్డాడు. దేశంలోనే అత్యధిక మార్కెట్ వాల్యూ కలిగిన హీరోగా ఉన్న ప్రభాస్ కోసం బాలీవుడ్ దర్శకులు సైతం క్యూ కడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios