సాహో సరికొత్త రికార్డులని నెలకొల్పుతూ తెలుగు సినిమాకు మరో గర్వకారణంగా మారుతోంది. బాలీవుడ్ వర్గాలని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తేలా ఓ తెలుగు సినిమా 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కడం విశేషం. బాహుబలి తర్వాత మరోసారి అంతటి అనుభూతిని అందించాలని ప్రభాస్ భావించాడు.
భారీ అంచనాల నడుమ శుక్రవారం నాడు 'సాహో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిరోజు సినిమా చూడాలని అభిమానులు థియేటర్ల వద్ద ఎగబడ్డారు. ఆన్లైన్ పెట్టిన టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్ అయిపోతున్నాయంటే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతోంది.
ఇలాంటి సినిమాకి ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో వస్తాయో ఊహించుకోవచ్చు. తొలిరోజు ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందోననే ఉత్కంఠ అందరిలోనూ పెరిగిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 'బాహుబలి' స్థాయిలో వసూళ్లు రాబట్టడానికి అవకాశాలు ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచారు. ఏపీలో బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. ఈ వీకెండ్ మొత్తం హౌస్ ఫుల్స్ ఖాయం. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా తొలిరోజు రూ.35 నుండి 40 కోట్ల మధ్య షేర్ వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
గ్రాస్ యాభై కోట్లు దాటే ఛాన్స్ ఉంది. 'కర్ణాటక'లో కూడా సినిమాకి మంచి క్రేజ్ కనిపిస్తోంది. బయటి రాష్ట్రాలన్నింట్లో, విదేశాల్లో కలిపి రూ.50 కోట్లకు మించి గ్రాస్ కలెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం రూ.290 కోట్ల షేర్ రాబట్టాల్సివుంది!
'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!
'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!
'సాహో' థియేటర్ వద్ద విషాదం.. వ్యక్తి మృతి!
సాహో, సైరా లెక్కలు బాగానే ఉంటాయి.. కానీ!
ప్రభాస్ గురించి తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ గొడవ
'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!
సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!
అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?
‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?
‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!
సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!
తెలంగాణాలో 'సాహో' ప్రీమియర్లు.. కష్టమే!
సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
