Asianet News TeluguAsianet News Telugu

మెగా 154లో రవితేజ రోల్ లీక్.. అంచనాలు పెంచేసే మ్యాటర్ ?

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మోగించారు. ఆచార్య చిత్రంతో నిరాశపరిచినప్పటికీ.. గాడ్ ఫాదర్ మూవీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. 

Ravi teja role leaked from Mega 154
Author
First Published Oct 7, 2022, 1:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మోగించారు. ఆచార్య చిత్రంతో నిరాశపరిచినప్పటికీ.. గాడ్ ఫాదర్ మూవీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. దీనితో చిరంజీవి ఇక తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. చిరంజీవి నెక్స్ట్ మూవీ మెగా 154 డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 

ఈ మూవీలో చిరంజీవి ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ చేస్తున్నారు. మత్స్యకార నాయకుడిగా చిరంజీవి ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు టాక్. అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత రవితేజ మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయనతో కలసి నటిస్తున్నారు. 

గతంలో రవితేజ చిరంజీవితో కలిసి అన్నయ్య చిత్రంలో నటించారు. ఇన్నేళ్ల తర్వాత మెగా 154లో రవితేజ నటిస్తుండడం ఉత్కంఠగా మారింది. రవితేజ రోల్ ఏంటి ? చిరంజీవితో రవితేజ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి? డైరెక్టర్ బాబీ ఎలా ప్లాన్ చేశారు ? అంటూ ఇన్ని ప్రశ్నలతో ఫ్యాన్స్ లో ఈ మూవీపై ఆసక్తి పెరిగిపోతోంది. 

రవితేజ రోల్ లీక్ అయింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది, రవితేజ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారట. చిరంజీవి యూనియన్ లీడర్ గా నటించడం.. రవితేజ పోలీస్ గా నటించడం చూస్తుంటే.. వీరిద్దరి మధ్య బలమైన కాంఫ్లిక్ట్ కథలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios