Asianet News TeluguAsianet News Telugu

'83' టీజర్ వచ్చేసింది.. కపిల్ దేవ్ గా రణ్వీర్ సింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అదుర్స్

భారత దిగ్గజ క్రికెటర్స్ లో కపిల్ దేవ్ ఒకరు. టీమిండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన సారథి అతడు. 1983లో ఇండియా ప్రపంచకప్ గెలవడంలో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు, బయోపిక్ చిత్రాలు ఇండియన్ స్క్రీన్ పై ఎక్కువగా తెరకెక్కుతున్నాయి.

RanVeer Singh 83 movie teaser is here
Author
Hyderabad, First Published Nov 26, 2021, 11:49 AM IST

భారత దిగ్గజ క్రికెటర్స్ లో కపిల్ దేవ్ ఒకరు. టీమిండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన సారథి అతడు. 1983లో ఇండియా ప్రపంచకప్ గెలవడంలో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు, బయోపిక్ చిత్రాలు ఇండియన్ స్క్రీన్ పై ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పేదేముంది. క్రికెట్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా అలాంటి చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. 

ఇప్పటికే ఎం ఎస్ ధోని, సచిన్ జీవిత చరిత్రలపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. Kapil Dev జీవిత చరిత్రపై కూడా 83 పేరుతో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో కపిల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో Ranveer Singh నటిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 83పై భారీ అంచనాలు ఉన్నాయి. 

కపిల్ జీవిత చరిత్రని వెండితెరపై ఆవిష్కరిస్తూనే 1983 నాటి ప్రపంచ కప్ గెలుపు మధుర క్షణాలు, భావోద్వేగాల్ని దర్శకుడు కబీర్ ఖాన్ చూపించబోతున్నారు. తాజాగా 83 చిత్రం నుంచి టీజర్ విడుదలయింది. 1983 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ దృశ్యాలని టీజర్ లో చూపించారు. ఈ టీజర్ లో రణ్వీర్ సింగ్ మెరుపు కాలం మాత్రమే కనిపించారు. 

వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు విప్ రిచర్డ్స్ ని అవుట్ చేయడంతో మ్యాచ్ ఇండియా వైపు తిరిగింది. మదన్ లాల్ బౌలింగ్ లో రిచర్డ్స్ 33 పరుగుల వద్ద బంతిని గాల్లోకి కొడతారు. దీనితో కపిల్ దేవ్ వెనక్కి పరిగెడుతూ అత్యంత కష్టమైన క్యాచ్ ని అద్భుతంగా అందుకుంటాడు. ఫైనల్ మ్యాచ్ లో అదే కీలక మలుపు. టీజర్ లో ఆ దృశ్యాల్ని చూపించారు. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ క్యాచ్ అందుకుంటుండగా 83 అనే టైటిల్ పడుతుంది. టీజర్ లో విజువల్స్ బావున్నాయి. 

నవంబర్ 30న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రం ఇండియా మొత్తం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా చిత్రంగా 83 హిందీతో పాటు దక్షణాది భాషల్లో కూడా రిలీజ్ కానుంది. రణ్వీర్ సింగ్ రియల్ లైఫ్ వైఫ్ దీపికా పదుకొనె ఈ చిత్రంలో కపిల్ భార్య రోమి దేవ్ రోల్ లో నటిస్తోంది. 

Also Read:Samantha: బోల్డ్ రోల్ తో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. డేరింగ్ డెసిషన్, శృంగార పరమైన అంశంతో..

Follow Us:
Download App:
  • android
  • ios