- Home
- Entertainment
- కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
స్కూల్ అంటే ఇష్టపడని పిల్లలు చాలామంది ఉంటారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా.. చాలామందికి కూడా స్కూల్ అంటే ఇష్టం ఉండదు. స్కూల్ తప్పించుకోవడానికి రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. అయితే ఒక స్టార్ హీరోకి మాత్రం స్కూల్ గేట్ చూసినా వెంటనే టాయిలెట్ వచ్చేదట.

కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన హీరో
స్కూల్ అంటే భయపడటం, ఎగ్జామ్స్ సమయంలో భయంతో కాపీ కొట్టడం వంటి తిప్పలు కేవలం సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా తప్పలేదు. చాలామంది హీరోలు తమ స్కూల్ డేస్ గురించి ఫన్నీ విశేషాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు. కానీ ఒక టాలీవుడ్ హీరో మాత్రం "నేను కాపీ కొట్టే డిగ్రీ పాస్ అయ్యాను" అని ఎంతో ధైర్యంగా, నిజాయితీగా చెప్పుకున్నారు. ఆ హీరో ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు జగపతి బాబు.
ఫ్యామిలీ హీరోగా గుర్తింపు
తెలుగు పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు జగపతి బాబు. హీరోగా లక్షల మంది అభిమానులను సంపాదింుకున్న ఆయన.. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలతో మెప్పిస్తున్నారు. జగపతి బాబు తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్లు, అత్యంత నిష్కపటంగా వ్యక్తీకరిస్తారు. ఒక ప్రముఖ టాక్ షోలో తన స్కూల్ రోజుల్లో చదువుపై ఉన్న భయాలు, డిగ్రీ పూర్తి చేసిన విధానం గురించి ఆయన పంచుకున్న విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.
స్కూల్ గేట్ చూడగానే టాయిలెట్ వచ్చేది
చాలామంది తమ చిన్ననాటి జ్ఞాపకాలను లేదా చదువును గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ జగపతి బాబు మాత్రం తన బాల్యంలో చదువు పట్ల ఉన్న అయిష్టతను ఓపెన్‌గా అంగీకరించారు. "నాకు అసలు చదువుకోవడం అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పుడు స్కూల్ గేట్ చూడగానే కడుపులో భయం మొదలై, వెంటనే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది" అని చెప్పారు. ఆ తర్వాతి కాలంలో తాను పెద్ద సెలబ్రిటీ అయి, ఏసీ కార్లలో, ప్రొటెక్షన్ బలగంతో అదే స్కూల్‌కి వెళ్లినా కూడా ఆ గేట్ చూడగానే మళ్లీ పాత భయమే గుర్తొచ్చేదని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
కాపీ కొట్టే డిగ్రీ పాస్ అయ్యాను
ఇదే ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రశ్నిస్తూ.. "స్కూల్ అంటే ఇంత భయం కదా, మరి ఏం చదివారు?" అని అడిగినప్పుడు జగపతి బాబు ఏమాత్రం దాచకుండా అసలు నిజం చెప్పారు.
"నేను ఎట్టాగోలా కాపీ కొట్టే డిగ్రీ పాస్ అయ్యాను. ఇది మంచి ఉదాహరణ (Bad Example) కాదు, కానీ నిజం చెప్పాలంటే అంతే!" ఆ కాలంలో ఉండే బి.ఏ కార్పొరేట్ (B.A. Corporate) కోర్సును, అలాగే పేరుకు మాత్రమే డిగ్రీ ఉండాలని ఇంగ్లీష్ ఆనర్స్ లాంటి కోర్సు చదివినట్లు ఆయన వివరించారు. స్కూల్ డేస్‌లో చదువు అబ్బకపోయినా, పరీక్షల్లో పద్ధతి సరిగ్గా లేకపోయినా ఆ విషయాలను దాచకుండా బహిరంగంగా ఒప్పుకోవడం జగపతి బాబు నిజాయితీకి నిదర్శనం. ప్రతి ఒక్కరికీ పుస్తకాల చదువు ఒక్కటే జీవితం కాదని, స్వయంకృషి, నటనపై ఉన్న అభిరుచితో ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జగపతి బాబు తన సినీ ప్రయాణం ద్వారా నిరూపించారు.

