టాలీవుడ్ టాప్ హీరోయిన్ కిరీటం రకుల్ ప్రీత్ సింగ్ చేయి జారిపోతోంది. ప్రస్తుతం రకుల్ తెలుగు సినిమాలన్నీ చర్చల్లో తప్ప చేతుల్లో ఏమీ లేవు. ఒకప్పుడు టాప్ హీరోయిన్లందరికీ ఆమె ఒక్కతే ఛాయిస్ గా ఉండేది. ఈమధ్య ఆమె బాలీవుడ్ సినిమాపై ఫోకస్ పెట్టడం.. ఇక్కడేమో కాంపిటీటర్లు పెరగడంతో టాలీవుడ్ లో ఛాన్సులు తగ్గిపోయాయి. 

టాప్ హీరోయిన్ గా ఉన్న రోజుల్లో ఓ సినిమాలో నటించాలంటే రకుల్ కళ్లు తిరిగే మొత్తం డిమాండ్ చేసేదని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేక పోవడంతో రెమ్యునరేషన్ బాగానే తగ్గించుకుంటోందని తెలుస్తోంది. ఈ సమాచారం నెమ్మదిగా నిర్మాతల చెవికి చేరినా ఇంకా దర్శక - నిర్మాతల ఫోకస్ ఆమెపై పడలేదు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే సినిమాలో రకుల్ ఓ హీరోయిన్ గా నటిస్తుందనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ రోల్ కు కూడా ఆమెను తీసుకోవడం లేదని... రాజమౌళి ఇంకో హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. 

టాలీవుడ్ టైం కలిసిరాకపోయినా కోలీవుడ్ లో మాత్రం లక్కు బాగానే కలిసొస్తోంది. గతేడాది కార్తి హీరోగా నటించిన తీరన్ అదిగారమ్ ఒండ్రు సినిమాలో నటించిన రకుల్ కు మరోసారి కార్తి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది. దీంతోపాటు అతడి అన్న సూర్య హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీలోనూ ఆమే హీరోయిన్ గా చేస్తోంది. అల్రెడీ తన బాడీ వెయిట్ తగ్గించుకున్న రకుల్.. ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా తగ్గించింది కాబట్టి తెలుగులో మరిన్ని అవకాశాలు తలుపుతట్టే అవకాశం ఉంది. సెక్సీ సిన్నది తగ్గింది కాబట్టి.. చూద్దాం మరి.