Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి కాకున్నా పిల్లల్ని కనొచ్చు కదా.. సన్నీ నేనూ ఒకన్ని చూసుకుంటా: రాఖీ సావంత్

  • బాలీవుడ్ లో ఐటమ్  గర్ల్స్ సన్నీ, రాఖీల మధ్య కోల్డ్ వార్
  • అప్పుడప్పుడు బహిరంగంగానే సన్నీపై విరుచుకకుపడ్డ రాఖీ
  • తాజాగా సన్నీ కవల పిల్లలపై రాఖీ వెక్కిరింతలు
rakhi sawanth sarcastic comments on sunny leone

బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ , సన్నీ లియోనీ మొదటి నుంచి ఎడమొహం పెడమొహందానే వుంటున్నారు. ఈ ఇద్దరు ఐటమ్ గర్ల్స్ మధ్య వైరం ఎలుక, పిల్లి మాదిరిగా వుంటుంది. వీళ్లిద్దరి మధ్య వైరం బాలీవుడ్ మొత్తం చర్చించుకునే స్థాయిలో నడించిందంటే ఏ రేంజ్ లో వుందో అర్ధం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో రాఖీ అంటే మామూలు విషయం కాదు.

 

గతంలో ఓసారి తనదైన శైలిలో సన్నీపై సెటైర్లు వేసింది రాఖీ. సన్నీ మూలంగా దేశంలో యువత చెడిపోతున్నారంటూ, పోర్న్ స్టార్ కు ఇక్కడేం పని అంటూ రాఖీ చాలా వెక్కిరిస్తూ వ్యాఖ్యానించింది. బట్టలు లేకుండా కనిపించే సన్నీని అంతా దేవతలా కొలుస్తున్నారంటూ రాఖీ గతంలో వ్యాఖ్యానించింది.

 

తాజాగా సన్నీపై మరోసారి తన ప్రతాపం చూపేందుకు ప్రయత్నించింది రాఖీ. అయితే ఈసారి కాస్త కామిక్ గా(వినోదాత్మకంగా). సన్నీ, వెబెర్ దంపతులు ఇటీవలే సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో.. రాఖీ తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్  లో.. సన్నీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కంగ్రాచులేషన్స్ అంటూనే సెటైర్లు వేసింది. సన్నీ పిల్లలిద్దరూ సరొగసీ ద్వారా జన్మించిన పిల్లలని తెలియదేమో కానీ రాఖీ మాత్రం.. సన్నీ ప్రెగ్నెన్సీ గురించి ప్రస్తావిస్తూ.. ఈ పిల్లలు ముంబైలో పుట్టారా లేక లాస్ ఏంజెల్స్ లోనా అంటూ ప్రశ్నించింది రాఖీ.

 

అంతేకాదు.. రాఖీ కూడా సన్నీ తరహాలోనే పిల్లల్ని కంటానంటోంది. తనకు కూడా తల్లి కావాలనుందని అంటున్న రాఖీ.. అంతకన్నా ముందు తనకు నచ్చిన వాడిని వెతుక్కోవాలని అంటోంది.

Follow Us:
Download App:
  • android
  • ios