ఆసియాలో సెక్సీయెస్ట్ విమెన్ గా ప్రియాంక.. లిస్ట్ లో శ్రీదేవి.. ఇంకా..

First Published 7, Dec 2017, 1:43 PM IST
priyanka chopra listed top in eastern eye survey
Highlights
  • ఆసియాలో సెక్సీయెస్ట్ విమెన్ గా ప్రియాంక చోప్రా
  • లండన్ కేంద్రంగా పనిచేసే ఈస్టర్న్ ఐ వీక్లీ సర్వేలో టాపర్
  • ప్రియాంక చోప్రా నెంబర్ వన్ గా నిలవగా లిస్ట్ లో టాప్ 50లో శ్రీదేవి

యూకెలో నిర్వహించిన ఓ ఆన్ లైన్ సర్వేలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సెక్సియెస్ట్ ఏసియన్ ఉమెన్‌గా నిలిచింది. మొత్తం టాప్ 50 సెక్సియెస్ట్ ఉమెన్ జాబితా విడుదల చేయగా ఇందులో ప్రియాంక చోప్రా మొదటి స్థానం దక్కించుకుంది. లండన్ బేస్డ్ వీక్లీ 'ఈస్టర్న్ ఐ' ఈ సర్వే నిర్వహించింది. 2016లో నెం.1 స్థానంలో ఉన్న దీపిక ఈ ఏడాది సర్వేలో 3వ స్థానానికి పడిపోయారు.

 

తనకు సెక్సియెస్ట్ ఉమెన్ గా నెం.1 స్థానం దక్కడంపై ప్రియాంక చోప్రా స్పందిస్తూ... ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ నా జీన్స్, మీ దృష్టికోణానికే దక్కుతుంది. తనకు ఓటు వేసిన అందరికీ థాంక్స్ అని అన్నారు. ఇండియన్ టీవీ నటి నియా శర్మ ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ స్టార్ దీపికను వెనక్కి నెట్టి ఆమె ఈ స్థానం దక్కించుకోవడం విశేషం.

 

దీపిక 3వ స్థానంలో, అలియా భట్ 4వ స్థానంలో, పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ 5వ స్థానంలో నిలిచారు. 6వ స్థానంలో ద్రష్టి ధామి, 7వ స్థానంలో కత్రినా, 8వ స్థానంలో శ్రద్ధా కపూర్, 9వ స్థానంలో గౌహర్ ఖాన్, 10వ స్థానంలో రుబీనా దిలైక్ నిలిచారు.

 

ఈ లిస్టులో మరో కొత్త అమ్మాయికి కూడా చోటు దక్కింది. ‘యే రిష్టా క్యా కెహల్తా హై' అనే సీరియల్ నటి, 19 ఏళ్ల శివంగి జోషికి 16వ స్థానం దక్కింది. ఈలిస్టులో ప్రముఖ నటి శ్రీదేవికి 49వ స్థానం దక్కింది. 50 మందితో కూడిన ఈ జాబితాలో అందరి కంటే వయసు ఎక్కువ ఉన్న మహిళ కూడా ఈవిడే. శ్రీదేవి వయసు 54 సంవత్సరాలు.

loader