Asianet News TeluguAsianet News Telugu

'సాహో' 6 రోజుల కలెక్షన్స్.. ఇక అంతా అయిపోయింది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం దాదాపు రెండేళ్లు ఎదురుచూశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో ప్రేక్షకులని అలరించడంలో విఫలమైంది. సినిమా మేకింగ్ పరంగా గ్రాండ్ గా ఉన్నప్పటికీ ఆకట్టుకోలేకపోయింది. 

Prabhas Saaho movie 6 days collections
Author
Hyderabad, First Published Sep 5, 2019, 3:47 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం దాదాపు రెండేళ్లు ఎదురుచూశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో ప్రేక్షకులని అలరించడంలో విఫలమైంది. సినిమా మేకింగ్ పరంగా గ్రాండ్ గా ఉన్నప్పటికీ ఆకట్టుకోలేకపోయింది. 

బాహుబలి తర్వాత నార్త్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో సాహో చిత్రానికి అక్కడ మంచి వసూళ్లు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం సాహో చిత్రం ఓపెనింగ్స్ విషయంలో వసూళ్లు అదరగొట్టింది. శుక్రవారం నుంచి సోమవారం రోజు విజయకా చవితి హాలిడే వరకు మంచి నైజాం లాంటి ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. 

కానీ మంగళవారం నుంచి సాహో చిత్రానికి అసలు పరీక్ష మొదలైంది. మంగళవారం వసూళ్ళలో డ్రాప్ స్పష్టంగా కనిపించింది. ఇక 6వ రోజైన బుధవారం రోజు సాహో వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో చిత్రం 6వ రోజు రాబట్టిన షేర్ కేవలం 1.70 కోట్లు. దీనితో 6 రోజుల్లో ఏపీ, తెలంగాణ మొత్తం షేర్ 72 కోట్లకు పైగా నమోదైంది. 

కానీ జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే ఈ వసూళ్లు ఏమాత్రం సరిపోవు. ఆరవరోజు ఈ చిత్ర ప్రదర్శన చూసి అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే బయ్యర్లు నష్టపోవడం ఖాయం అని ట్రేడ్ అనలిస్టులు అంచనాకు వచ్చేశారు. 

నైజాంలో ఈ చిత్ర హక్కులు 40 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు అక్కడ వచ్చిన షేర్ మొత్తం 25 కోట్లు. సీడెడ్ లో 25 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగగా 6 రోజుల్లో 10 కోట్ల షేర్ వసూలైంది. మిగిలిన ఏరియాల్లో కూడా సాహో వసూళ్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి :

సాహోపై దర్శకుడి సెటైర్.. దుమ్మెత్తి పోస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్!

ముందే పసిగట్టిన రాజమౌళి.. ప్రభాస్ కు చెప్పినా వినలేదా ?

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్: తగ్గిన సాహో కలెక్షన్స్

'సాహో' ఆ మూడు చోట్లా డిజాస్టర్!

బాలీవుడ్ హీరోల రికార్డులు గల్లంతు.. 3వ రోజు 'సాహో' సంచలనం!

నార్త్ లో 'సాహో' కలెక్షన్ల సునామి.. ఏంటీ మాయ!

నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సాహో రెండవరోజు వసూళ్లు!

'సాహో' బాక్సాఫీస్: యూఎస్ లో కలెక్షన్ల పరిస్థితి ఇది!

సాహో వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్

రాజమౌళి సెంటిమెంట్ దెబ్బ.. ప్రభాస్ పై గట్టిగా పడిందే..!

'సాహో' పై నటి లిసా రే కాపీ ఆరోపణలు!

సాహో టాక్ పై కృష్ణంరాజు సతీమణి.. చిన్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు!

'సాహో' టాక్.. ట్రెండింగ్ లో అజ్ఞాతవాసి, లార్గో వించ్!

ప్రభాస్ 'సాహో'కి బిగ్ షాక్.. విడుదలైన గంటల్లోనే!

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ప్రీమియర్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios