అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సాహో చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన సాహో అభిమానులను ఆకట్టుకుంటుంది.  

అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'సాహో' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో 'సాహో'పై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్ నటి లిసా రే 'సాహో' చిత్రయూనిట్ పై కాపీ 
ఆరోపణలు చేస్తోంది.

సాహో యూనిట్‌, షిలో శివ్‌ సులేమాన్‌ ఆర్ట్‌ వర్క్‌ను కాపీ కొట్టారని లిసా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభాస్‌, శ్రద్ధా కలిసి ఉన్న ‘బేబీ వోన్ట్‌ యూ టెల్‌ మీ’ అనే పోస్టర్‌ను, దాంతో పాటు ఒరిజినల్‌ పోస్టర్‌కు సంబంధించిన చిత్రాలను లిసా రే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ రెండు ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్ట్‌ వర్క్‌ ఒకేలా ఉండడంతో లిసారే మండిపడింది.

'సాహో' లాంటి భారీ బడ్జెట్ సినిమాలో షిలో ఆర్ట్ వర్క్ ను కాపీ చేశారని.. దీన్ని ప్రేరణ అనలేమని.. కచ్చితంగా దొంగతనమేనని అన్నారు లిసారే. ఇలాంటి పనులను ప్రపంచంలో ఎవరూ సపోర్ట్ చేయరని.. ఈ ఆర్ట్ వర్క్ ని వాడుకునే ముందు 'సాహో' యూనిట్ దాని సంబంధింత యజమానిని సంప్రదించలేదని.. ఆమె అనుమతి తీసుకాలేదని.. కనీసం ఆమె పనికి తగిన గుర్తింపు కూడా ఇవ్వలేదని.. ఇది కరెక్ట్ కాదని మండిపడింది.

ఇలాంటి పరిస్థితుల్లో సదరు వ్యక్తికి ఎలా ఉంటుందంటే.. ఎవరో దొంగ మీ ఇంట్లో చొరబడి మీ జీవితానికి, మీ జీవనోపాధికి, ఆత్మకు సంబంధించిన ముఖమైన వస్తువును దొంగిలిస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు షిలో పరిస్థితి కూడా అలానే ఉందంటూ తెలిపారు. 

View post on Instagram