భారీ అంచనాలతో విడుదలైన సాహో టాక్ తో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది. బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కావడంతో బాలీవుడ్ ఆడియెన్స్ కూడా సినిమాపై తెగ ఇంట్రెస్ట్ చూపించారు. అయితే సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. 

ఇకపోతే బాలీవుడ్ లో సినిమాకు హాలిడేస్ బాగానే ఉపయోగపడినప్పటికీ 5వ రోజు కలెక్షన్స్ సింగిల్ డిజిట్ కి చేరుకున్నాయి. శుక్రవారం రిలీజైన ఈ సినిమా హిందీలో 24.40కోట్లను అందుకుంది. ఇక శనివారం(25.20 cr)  ఆదివారం (29.48 c) సోమవారం (14.20 cr) వరకు కూడా మంచి కలెక్షన్స్ ని అందుకున్న సాహో మంగళవారం 9కోట్లను మాత్రమే రాబట్టింది. 

మొదటి 5రోజుల్లో మొత్తంగా 102కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఇక మిగతా రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. వరల్డ్ వైడ్ గా 350కోట్లవరకు రాబట్టినట్లు టాక్ వస్తోంది. అయితే సాహో బాలీవుడ్ లో మొత్తంగా 110కోట్ల వరకు కలెక్షన్స్ ని ఈజీగా అందుకుంటుందని ఎనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు.