Asianet News TeluguAsianet News Telugu

సాహోపై దర్శకుడి సెటైర్.. దుమ్మెత్తి పోస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కనీవినీ ఎరుగని అంచనాలతో, మునుపెన్నడూ లేని విధంగా సాహో చిత్రాన్ని 10 వేల స్క్రీన్స్ లో  రిలీజ్ చేశారు. కానీ సాహో చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ తో సాహో చిత్రం నార్త్ లో బాగా రాణిస్తోంది. 

Tamil Director satires on Prabhas Saaho movie
Author
Hyderabad, First Published Sep 4, 2019, 6:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కనీవినీ ఎరుగని అంచనాలతో, మునుపెన్నడూ లేని విధంగా సాహో చిత్రాన్ని 10 వేల స్క్రీన్స్ లో  రిలీజ్ చేశారు. కానీ సాహో చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ తో సాహో చిత్రం నార్త్ లో బాగా రాణిస్తోంది. 

ఇదిలా ఉండగా సాహో చిత్రాన్ని కెలికిన ఓ దర్శకుడు విమర్శల పాలవుతున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా సాహో చిత్రంపై సెటైర్లు వేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. సాహో దెబ్బతో బాలీవుడ్ ప్రముఖులు సైతం తమ చిత్రాలని వాయిదా వేసుకున్నారు. 

తెలుగు, తమిళ భాషల్లో కూడా కొన్ని చిత్రాలు వాయిదా పడి సాహోకి దారిచ్చాయి. కానీ తమిళ నటుడు వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన 'సిక్సర్' అనే చిత్రాన్ని సాహోకి పాటే ఆగష్టు 30న రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ వచ్చింది. రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. కానీ సాహోకి మాత్రం డివైడ్ టాక్ వచ్చింది. 

వెంకట్ ప్రభుకి, వైభవ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అతడిని పొగిడే క్రమంలో సాహోపై వెంకట్ ప్రభు సెటైర్స్ వేశాడు. 'రివ్యూలన్నీ చూస్తుంటే ఈ వీకెండ్ 'సిక్సర్' దే అని పిస్తోంది. నా 'సాహో'దరుడు(సహోదరుడు) వెంకట్ కు శుభాకాంక్షలు అని వెంకట్ ట్వీట్ చేశారు. 

వెంకట్ ప్రభు చేసిన ఈ ట్వీట్ ప్రభాస్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. ప్రభాస్ గతంలో వెంకట్ ప్రభుకి ప్రతిభని మెచ్చుకున్న వీడియో వైరల్ చేస్తున్నారు. వెంకట్ ప్రభు అవకాశవాది అని తెలిసిపోయింది. ప్రభాస్ ఇలాంటి వ్యక్తి కోసం అనవసరంగా సమయం వృధా చేసుకున్నాడు అంటూ వెంకట్ ప్రభుపై దుమ్మెత్తి పోస్తున్నారు.  

 

ఇవి కూడా చదవండి :

ముందే పసిగట్టిన రాజమౌళి.. ప్రభాస్ కు చెప్పినా వినలేదా ?

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్: తగ్గిన సాహో కలెక్షన్స్

'సాహో' ఆ మూడు చోట్లా డిజాస్టర్!

బాలీవుడ్ హీరోల రికార్డులు గల్లంతు.. 3వ రోజు 'సాహో' సంచలనం!

నార్త్ లో 'సాహో' కలెక్షన్ల సునామి.. ఏంటీ మాయ!

నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సాహో రెండవరోజు వసూళ్లు!

'సాహో' బాక్సాఫీస్: యూఎస్ లో కలెక్షన్ల పరిస్థితి ఇది!

సాహో వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్

రాజమౌళి సెంటిమెంట్ దెబ్బ.. ప్రభాస్ పై గట్టిగా పడిందే..!

'సాహో' పై నటి లిసా రే కాపీ ఆరోపణలు!

సాహో టాక్ పై కృష్ణంరాజు సతీమణి.. చిన్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు!

'సాహో' టాక్.. ట్రెండింగ్ లో అజ్ఞాతవాసి, లార్గో వించ్!

ప్రభాస్ 'సాహో'కి బిగ్ షాక్.. విడుదలైన గంటల్లోనే!

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ప్రీమియర్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?

 

Follow Us:
Download App:
  • android
  • ios