దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పని చేయాలని ప్రతీ హీరో కోరుకుంటాడు. తమ కెరీర్ లో ఒక్కసారైనా రాజమౌళితో కలిసి పని చేయాలని భావిస్తోన్న హీరోలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. తన సినిమాల్లో నటించే హీరోలకు రాజమౌళి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడో అందరికీ తెలిసిందే. అందుకే ఆయనతో కలిసి పని చేయాలని హీరోలు  ఆరాటపడుతుంటారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక సెంటిమెంట్ మాత్రం హీరోలను భయపెడుతోంది. అదేంటంటే.. రాజమౌళి ఏ హీరోతో కలిసి పని చేసినా.. ఆ తరువాత ఆ హీరో చేసే సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారుతున్నాయి. ఇదేదో యాధృశ్చికంగా జరిగింది కాదు. రాజమౌళితో కలిసి పని చేసిన చాలా మంది హీరోలు ఈ పరిస్టితిని ఎదుర్కొన్నారు. 

ఎన్టీయార్ రాజమౌళి దర్శకత్వంలో 'స్టూడెంట్ నెంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' సినిమాల్లో నటించాడు. కానీ ఆ సినిమాల తరువాత వచ్చిన 'సుబ్బు', 'ఆంధ్రావాలా', 'కంత్రి' సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి.రాజమౌళి నితిన్ కాంబోలో వచ్చిన 'సై' సినిమా తరువాత నితిన్ హిట్టు కొట్టడానికి 'ఇష్క్' సినిమా దాకా ఎదురు చూడాల్సి వచ్చింది.

రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్రభాస్ కు 'ఛత్రపతి' తరువాత 'పౌర్ణమి', రవితేజకు 'విక్రమార్కుడు' తరువాత 'ఖతర్నాక్', నానికు 'ఈగ' తరువాత 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

ఇప్పుడు 'బాహుబలి 1', 'బాహుబలి 2' సినిమాల తరువాత ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. రాజమౌళి సెంటిమెంట్ కి ప్రభాస్ రెండో సారి బలైపోయాడని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.  ప్రభాస్ ను తిరిగి నిలబెట్టగలిగే శక్తి ఒక్క రాజమౌళికి మాత్రమే ఉంది అన్న  కామెంట్స్ వినిపిస్తున్నాయి.