యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం శుక్రవారం రోజులు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని దాదాపు 10 వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 1500 స్క్రీన్స్ క్లో సాహో విడుదలయింది. తొలి షో నుంచే సాహో చిత్రానికి డివైడ్ టాక్ మొదలయింది. 

క్రిటిక్స్ కూడా నెగిటివ్ గా రివ్యూలు ఇచ్చారు. కానీ టాక్ తో నిమిత్తం లేకుండా సాహో చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. బాహుబలి2 తర్వాత మరే ఇండియన్ సినిమాకు సాధ్యం కానివిధంగా తొలి రోజే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. శనివారం కూడా సాహో వసూళ్లు స్ట్రాంగ్ గానే ఉన్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. 

కానీ యూఎస్ లో మాత్రం సాహో వసూళ్లు కాస్త ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. సాహో చిత్రం యూఎస్ ప్రీమియర్స్ ద్వారా దాదాపు 9 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఇది నిరాశాజనకమైన ఆరంభం. శుక్రవారం రోజు 5 లక్షల డాలర్ల వరకు రాబట్టింది. ఇక శనివారం 4 లక్షల డాలర్లతో సరిపెట్టుకుంది. మొత్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు యుఎస్ లో 1.8 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. 

ఆదివారం రోజుకు సాహో 2 మిలియన్ మార్క్ ని అందుకోబోతోంది. సాహో చిత్రానికి యుఎస్ లో 40 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే సాహో చిత్రం యూఎస్ లో 5 మిలియన్ల వరకు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.