యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో రిలీజ్ చేశారు. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు. 

సాహో చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు బావున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో మెప్పించే విధంగా లేదని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. సినీ విశ్లేషకుల నుంచి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఐమాక్స్ లో వీక్షించారు. అభిమానుల స్పందన గురించి మీడియాతో మాట్లాడారు. 

సాహో చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. చిన్న దర్శకుడు అయినప్పటికీ ప్రభాస్ సుజీత్ కు ఛాన్స్ ఇచ్చాడని శ్యామలాదేవి అన్నారు. సాహో చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉందని అంతా అంటుంటే సంతోషంగా ఉందని అన్నారు. 

ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ప్రభాస్ ఇక్కడ ఉండడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడని శ్యామలాదేవి అన్నారు. 

ఇవి కూడా చదవండి :

'సాహో' టాక్.. ట్రెండింగ్ లో అజ్ఞాతవాసి, లార్గో వించ్!

ప్రభాస్ 'సాహో'కి బిగ్ షాక్.. విడుదలైన గంటల్లోనే!

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ప్రీమియర్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?