ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ఈ క్రమంలో పైరసీ రాయుళ్లకు శ్రద్ధా వార్నింగ్ ఇచ్చింది.  భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించామని.. సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని చెప్పింది. చిత్రబృందం ఎన్నో సంవత్సరాల కష్టమే ఈ చిత్రమని.. మీ ప్రేమాభిమానాలతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని.. ఇప్పుడు మా కష్టాన్ని మీ ముందు ఉంచామని చెప్పిన శ్రద్ధా.. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ 'ఇక సాహో మీది..అవాస్తవాలను ప్రచారం చేయకండి.. పైరసీని ప్రోత్సహించకండి' అని చెప్పుకొచ్చింది.

''సాహో సినిమాను మీ దగ్గర్లోని థియేటర్లలోనే చూడండి.. ఒకవేళ ఎవరైనాసినిమా పైరసీ చేసినట్లు తెలిస్తే వెంటనే నేను ఇచ్చిన పైరసీ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించండి'' అంటూ పోస్ట్ పెట్టింది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ సినిమా నిర్మించారు. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిబ్రాన్‌ నేపథ్య సంగీతాన్ని అందించారు.