Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ 'సాహో'కి బిగ్ షాక్.. విడుదలైన గంటల్లోనే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ శుక్రవారం రోజు థియేటర్స్ లోకి వచ్చేసింది. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయనే రెస్పాన్స్ వస్తున్నపటికీ ఓవరాల్ గా సినిమాపై మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా ఆశించిన స్థాయిలో లేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు.

Saaho movie leaked by tamil rockers
Author
Hyderabad, First Published Aug 30, 2019, 2:48 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ శుక్రవారం రోజు థియేటర్స్ లోకి వచ్చేసింది. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయనే రెస్పాన్స్ వస్తున్నపటికీ ఓవరాల్ గా సినిమాపై మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా ఆశించిన స్థాయిలో లేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్, ఆకాశాన్ని తాకే అంచనాలతో విడుదలైన ఈ చిత్రం వసూళ్లు ఏమేరకు ఉంటాయో వేచిచూడాలి. 

రెండేళ్లకు పైగా ఎంతో శ్రమించి దర్శకుడు, టెక్నీషియన్లు, నటీనటులు ఈ చిత్రం కోసం పని చేశారు. కానీ విడుదల రోజే సాహో చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. చిత్ర పరిశ్రమకు పెను సవాల్ గా మారిన పైరసీ సంస్థ తమిళ్ రాకర్స్ ప్రభాస్ సాహో చిత్రంపై పంజా విసిరింది. సాహో విడుదలైన కొన్ని గంటల్లోనే తమిళ రాకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఆన్లైన్ లో లీక్ చేసింది. 

తమిళ రాకర్స్ సంస్థ పైరసీ ప్రింట్ ని డౌన్ లోడింగ్ కి అందుబాటులో ఉంచింది. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన సాహో చిత్రానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే. గతంలో తమిళ్ రాకర్స్ కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ కు ముందు చెప్పి మరీ లీక్ చేశాయి. కానీ దీనిని అదుపు చేయడం మాత్రం ఎవరికీ సాధ్యం కావడం లేదు. 

తెలుగుతో పాటు దక్షణాది అన్ని భాషల్లో, హిందీలో సాహో చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో మురళి శర్మ, జాకీ ష్రాఫ్, మందిర బేడీ, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ లాంటి ప్రముఖ నటులంతా నటించారు. 

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ప్రీమియర్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?

 

Follow Us:
Download App:
  • android
  • ios