Asianet News TeluguAsianet News Telugu

నార్త్ లో 'సాహో' కలెక్షన్ల సునామి.. ఏంటీ మాయ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తొలి షో నుంచి డివైడ్ టాక్ స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా బాలీవుడ్ క్రిటిక్స్ అయితే సాహో చెత్తగా ఉందంటూ రివ్యూలు ఇచ్చారు. కానీ సాహో చిత్రానికి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ మాత్రం భిన్నంగా ఉంది. 

Saaho movie day 2 collection of Hindi version
Author
Hyderabad, First Published Sep 1, 2019, 3:21 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తొలి షో నుంచి డివైడ్ టాక్ స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా బాలీవుడ్ క్రిటిక్స్ అయితే సాహో చెత్తగా ఉందంటూ రివ్యూలు ఇచ్చారు. కానీ సాహో చిత్రానికి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ మాత్రం భిన్నంగా ఉంది. 

తొలిరోజు సాహో హిందీ వర్షన్ కు 24 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి రెండవ రోజు డ్రాప్ ఉంటుందని అంతా భావించారు. కానీ ఆశ్చర్యకరంగా సాహో చిత్రం శనివారం రోజు తొలిరోజుకంటే ఎక్కువగా 25 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో సాహో వసూళ్లు 49 కోట్లకు చేరాయి. 

నార్త్ ఆడియన్స్ ఈ యాక్షన్ చిత్రానికి బాగా కనెక్ట్ అయినట్లు ఉన్నారు. ఆదివారం రోజు కూడా హిందీలో ఈ చిత్ర థియేటర్స్ కి జనాలు ఎగబడ్డట్లు తెలుస్తోంది. మూడవరోజు కూడా సాహో హిందీలో మరో 20 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ ముగిసిన తర్వాత సాహో చిత్రం ఈ నేటివిటీకి అధికమించగలుతుందో లేదో చూడాలి. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. ప్రపంచ వ్యాప్తంగా సాహో చిత్రం తొలి రోజే 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి 2 తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ చిత్రం సాహో. 

తెలుగు రాష్ట్రాల్లో అయితే సాహో చిత్రం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగురాష్ట్రాల్లో సాహో చిత్రం తొలిరోజు రాబట్టిన షేర్ 36.5 కోట్లు. ఇదే జోరు వీకెండ్ మొత్తం కొనసాగిస్తే వినాయక చవితి హాలిడే కూడా ఉంది కాబట్టి సాహో చిత్రం నెగిటివ్ టాక్ తోనే అద్భుతాలు చేయొచ్చు అని అనుకున్నారు. 

కానీ శనివారం రోజు వసూళ్ళలో డ్రాప్ ఎక్కువగా కనిపిస్తోంది. నైజాం ఏరియాలో మాత్రం సాహో సాలిడ్ రన్ ని కొనసాగిస్తోంది. ఏపీలోని చాలా ఏరియాల్లో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహి రెండవరోజు రాబట్టిన షేర్ 10.3 కోట్లు. దీనితో ఏపీ, తెలంగాణాలో సాహో ఇప్పటివరకు సాధించిన షేర్ 46 కోట్లకు చేరింది. 

ఆదివారం, సోమవారం(వినాయక చవితి) రెండు రోజులు సెలవు దినాలు కాబట్టి సాహో ఎలాంటి బాక్సాఫీస్ రన్ ప్రదర్శిస్తుందో చూడాలి. తెలుగురాష్ట్రాల్లో సాహో చిత్రానికి 120 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. 

నైజాం ఏరియాలో సాహో చిత్రం తొలి రోజు 9 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. రెండవరోజు 5 కోట్లతో పట్టు నిలుపుకుంది. సీడెడ్ లో రెండు రోజుల్లో సాహి చిత్రం 6 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్ లో సాహో చిత్ర థియేట్రికల్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈస్ట్ గోదావరి, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కలెక్షన్ల డ్రాప్ ఎక్కువగా కనిపిస్తోంది. నెల్లూరులో తొలిరోజు ఈ చిత్రం 2.5 కోట్లు రాబట్టింది. రెండు శనివారంతో కలుపుకుంటే ఆ వసూళ్లు 2.8 కోట్లకు చేరాయి. రెండు రోజుల్లో వైజాగ్ లో 5 కోట్లు, గుంటూరులో 5 కోట్లు షేర్ సాహో చిత్రం సాధించింది. 

నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సాహో రెండవరోజు వసూళ్లు!

'సాహో' బాక్సాఫీస్: యూఎస్ లో కలెక్షన్ల పరిస్థితి ఇది!

సాహో వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్

రాజమౌళి సెంటిమెంట్ దెబ్బ.. ప్రభాస్ పై గట్టిగా పడిందే..!

'సాహో' పై నటి లిసా రే కాపీ ఆరోపణలు!

సాహో టాక్ పై కృష్ణంరాజు సతీమణి.. చిన్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు!

'సాహో' టాక్.. ట్రెండింగ్ లో అజ్ఞాతవాసి, లార్గో వించ్!

ప్రభాస్ 'సాహో'కి బిగ్ షాక్.. విడుదలైన గంటల్లోనే!

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ప్రీమియర్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios